Preeti Jhangiani husband: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీ జింగ్యానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త, నటుడు పర్వీన్ దబాస్ శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు బాలీవుడ్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రమాద సమయంలో ప్రీతీ జింగ్యానీ కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతి జింగ్యానీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాన్ సరసన తమ్ముడు సినిమా చేసింది. ఇందులో పవన్ కల్యాన్ ను ఆరాధించే జాను పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రీతి జింగ్యానీ చేసిన చిత్రాలేవి ఆడలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో మొహబ్బతే సినిమా ప్రీతి జింగ్యానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె భర్త పర్వీన్ దబాస్ బాలీవుడ్ కామెడీ చిత్రం ‘ఖోస్లా కా ఘోస్లా’లో చేసిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెప్టెంబర్ 21న ఉదయం జరిగిన ప్రమాదంలో పర్వీన్ దబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడు. అయితే ప్రమాదానికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఈ క్లిష్ట సమయంలో గోప్యతను కోరుతూ పర్వీన్ దబాస్ కుటుంబం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్వీన్ దాబాస్ శనివారం ఉదయం దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురయ్యారని పేర్కొంది. బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ప్రకటిచింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నదని వెల్లడచింది.
షాక్ లో జింగ్యానీ కుటుంబం
భర్త కారు ప్రమాదంలో గాయపడడంతో ప్రీతి జింగ్యానీ, ఆమె కుటుంబం షాక్‌లో ఉంది. అయితే పర్వీన్ దాబస్ కు తీవ్ర గాయాలైనట్లు మెడికల్ అప్డేట్లు వెల్లడిస్తున్నాయి. వైద్యులు అతనికి సీటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేస్తున్నారని తెలిసింది
పర్వీన్ దాబాస్ సినిమాలు
పర్వీన్ దబాస్ ‘ఖోస్లా కా ఘోస్లా’ అనే కామెడీ సినిమాతో గుర్తింపు పొందారు. అలాగే ‘రాగిణి ఎంఎంఎస్ 2’, ‘ఇందు సర్కార్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ తదితర చిత్రాల్లో నటించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’లో శోభితా ధూళిపాళ సరసన నటించాడు.
ప్రమాదంపై హీరోయిన్ ప్రీతి జింగ్యానీ కూడా స్పందించింది. ‘ ప్రస్తుతం తన కుటుంబమంతా షాక్‌లో ఉందని, ఏం మాట్లాడలేకపోతున్నామని పేర్కొంది. శనివారం తెల్లవారుజామున తన భర్త కారు ప్రమాదంలో గాయపడ్డారని తెలిపింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రస్తుతం తన పరిస్థితి కండీషన్ సీరియస్ ఉందని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని వివరించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలసి నటించిన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
ప్రీతి జింగానియా. హీరోను ప్రేమించే పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ ‘నరసింహనాయుడు’లో సెకండ్ హీరోయిన్ చేసింది. ఆ తర్వాత మోహనబాబు సూపర్ హిట్ మూవీ ‘అధిపతి’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక ఎన్టీఆర్ యమదొంగ సినిమాలోనూ ప్రత్యేక పాటలో నర్తించింది. అల్లరి నరేష్ కలిసి చేసిన చివరి చిత్రం విశాఖ ఎక్స్ ప్రెస్. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.
2008లో నటుడు పర్వీన్ దబాస్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంత కొలం సినిమాలకు దూరమైనా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నది. 43 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ ఆమె గ్లామర్ చెక్కు చెదరలేదు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More