Prashanth Varma Cancelled Movies: టాలీవుడ్ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma). ‘అ!’ అనే చిత్రం తో ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా ఈయన ఆ తర్వాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ వంటి చిత్రాలతో డీసెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఈయన ‘హనుమాన్’ చిత్రం చేసాడో, అప్పటి నుండి ఆయన పేరు ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో మారుమోగిపోయింది. అతి తక్కువ బడ్జెట్ తో అంతటి క్వాలిటీ విజువల్స్ ని రాబట్టడంతోనే ఇతను సిక్సర్ కొట్టేశాడు. ఆ తర్వాత అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం, పాజిటివ్ మౌత్ టాక్ తో ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ ఎక్కడికో వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు.
కానీ తీరా చూస్తే ఇతను ఒప్పుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. రీసెంట్ గానే ప్రభాస్ తో ఇతను చేయబోయే సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ని బకాసుర పాత్రలో చూపిస్తూ, ‘బక’ అనే సినిమాని ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడని. ఇది పూర్తి స్థాయి మైథాలజీ చిత్రమని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపించింది. కొన్ని నెలల క్రితమే ప్రభాస్ కి లుక్ టెస్ట్ కూడా చేశారు. అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నా సమయంలో రీసెంట్ గానే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి వినిపించాడని, ఈ స్క్రిప్ట్ కి ప్రభాస్ సంతృప్తి చెందలేదని, ఇది మనకు వర్కౌట్ అవ్వదు అంటూ ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసాడని టాక్. ఇదే కనుక నిజమైతే ప్రశాంత్ వర్మ కెరీర్ రిస్క్ లో పడినట్టే అనుకోవచ్చు.
ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టి ఆపేయాల్సి వచ్చింది. అందులో మొదటిది నందమూరి మోక్షజ్ఞ తేజ మొదటి చిత్రం. బాలయ్య బాబు ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా , ప్రశాంత్ వర్మ ని నమ్మి ఈ సినిమా బాధ్యతలను అతని చేతిలో పెట్టాడు. కానీ మధ్యలోనే వదిలేసాడు. అంతే కాకుండా ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్ తో ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమాని కూడా మొదలు పెట్టాడు. ఇది కూడా అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆపేసాడు . అంతే కాకుండా ఇతను అనేక నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్స్ అమౌంట్స్ తీసుకొని, సినిమాలు చేయడం లేదని ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యింది. ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ వర్మ చాలా రాంగ్ రూట్ లో వెళ్తున్నాడని తెలుస్తోంది. మేలుకోకపోతే కష్టం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.