Prashanth Varma : సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో అణిగిమణిగి ఉండాలి. అలాగే మన పని మనం చేసుకుంటు ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు సర్వేవైల్ అవుతాం. అంతే తప్ప సక్సెసులు వచ్చాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ మనల్ని తొక్కేయాలనినే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఎన్ని విజయాలు సాధించినా కూడా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అంతే తప్ప ఎవరి పనిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు చెబుతూ ఉంటారు. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆయన తనకి ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రశాంత్ వర్మ చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని వాళ్లకు సినిమాలు చేయకుండా ఆపుతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డితో కూడా కొన్ని విభేదాలైతే కలిగి ఉన్నాడు. ఇక వీటితో పాటుగా బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాధ్యతను తీసుకున్న ఆయన ఇప్పుడు నేను ఆ సినిమాని చేయలేను అంటూ చేతులెత్తేసారు.
ఈ విషయం మీద బాలయ్య కోపంతో ఉండటమే కాకుండా ప్రశాంత్ ను మందలిచ్చి పక్కకు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లతో కూడా ప్రశాంత్ వర్మ విభేదాలు పెట్టుకున్నాడు. వీటన్నింటి మధ్యలో ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఎలా రాణించగలుగుతాడు అనేది చర్చనీయాంశముగా మారింది. ఇండస్ట్రీలో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల చాలా దుర్భరమైన పరిస్థితులు రావచ్చు.
సక్సెస్ లో ఉన్నన్ని రోజులు పర్లేదు కానీ ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారని ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాకుండా చేస్తారనేది వాస్తవం… మరి అలాంటి నిజాన్ని తెలుసుకొని ప్రశాంత్ వర్మ ముందుకు సాగితే మంచిది.
ఇండస్ట్రీ లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి. కానీ ఫెయిల్యూర్ లో ఎలాగైతే మనం కామ్ గా, స్టడీగా ఉన్నామో సక్సెస్ లో కూడా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే మన కెరియర్ ను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినవాళ్ళం అవుతాం…లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…