Mahesh Babu – Sandeep Reddy Vanga : ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి సినిమా తాలూకు ట్రెండ్ మారుతూ ఉంటుంది. ‘శివ’ సినిమా వచ్చిన 30 సంవత్సరాల తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఈ సినిమా సాధించిన విజయంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం కొత్త కథలు వస్తాయి…మనవాళ్ళు సైతం అద్భుతాలను క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక సంకేతమైతే అందింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘అనిమల్’ సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో తనని చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు ను ఫుల్ టైం గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక దానికోసమే కథ చర్చలు కూడా జరుపుతున్నాడు.
ఇక వచ్చే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తన తదుపరి సినిమా విషయంలో కూడా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ రెండు సినిమాలకు సంబంధించిన పనులను ఏకకాలంలో చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
ఇక సందీప్ రెడ్డి వంగ మేకింగ్ అద్భుతంగా ఉంటుందంటూ తన అభిమానులు సైతం స్పిరిట్ మూవీ కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇక స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ ను టాప్ లెవల్ కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో సందీప్ ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం అతను టాప్ డైరెక్టర్గా మారడమే కాకుండా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాడు…ఇక ఈ మూవీ తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ సందీప్ సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…