https://oktelugu.com/

Srinidhi Shetty: కేజీఎఫ్ హీరోయిన్ కు వినూత్న రీతిలో విషెస్ చెప్పిన… డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Srinidhi Shetty: యష్ హీరోగా … ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ” కేజిఎఫ్ ” సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా  కన్నడ చిత్రసీమపై అందరి కళ్ళు  పడేలా చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ చిత్ర రెండవ భాగం “కేజిఎఫ్ చాప్టర్ 2 ” టైటిల్ తో తెరకెక్కుతుండగా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి.  రెండవ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 21, 2021 / 08:33 PM IST
    Follow us on

    Srinidhi Shetty: యష్ హీరోగా … ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ” కేజిఎఫ్ ” సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా  కన్నడ చిత్రసీమపై అందరి కళ్ళు  పడేలా చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ చిత్ర రెండవ భాగం “కేజిఎఫ్ చాప్టర్ 2 ” టైటిల్ తో తెరకెక్కుతుండగా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి.  రెండవ భాగంలో కూడా శ్రీనిధి శెట్టి… యష్ తో మరోసారి జతగా  నటించనుంది.

    కాగా ఈరోజు శ్రీనిధి తన 28 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ వినూత్న రీతిలో ఆమెకు విషెస్ తెలియజేశారు.  ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్ లో శ్రీనిధి రీనా దేశాయ్ పాత్రను పోషిస్తుంది. ఈ వీడియో లో శ్రీనిధి తోటి నటీనటులతో క్రికెట్ ఆడుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    https://twitter.com/prashanth_neel/status/1451150491090518019?s=20

    అలానే ఈ సినిమాలో  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సోను గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరంగడూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన పార్ట్ 2 టిజర్ యూట్యూబ్ లో సెన్సేషన్  క్రియేట్ చేస్తుంది. 200 మిలియన్ల వ్యూస్ ను దాటుకొని ముందుకు దూసుకుపోతుంది ఈ టీజర్.