Prashanth Neel- Rajamouli: భారతీయ తెర పై ప్రస్తుతం దక్షిణాది సినిమా ప్రభ ఓ వెలుగు వెలిగిపోతుంది. నార్త్ జనం సౌత్ సినిమాల ప్రభంజనంలో హాయిగా సేద తీరుతున్నారు. అందుకే.. సౌత్ సినిమా చూసి ప్రస్తుతం బాలీవుడ్డే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే, ఇంత ఘనతకి మొదటి కారణం.. రాజమౌళి అయితే, రెండో కారకుడు ప్రశాంత్ నీల్.

బాహుబలితో రాజమౌళి ఓ బాట క్రియేట్ చేస్తే.. కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్ ఆ బాటకు రాజయోగం పట్టించాడు. పైగా ఆర్‌ఆర్‌ఆర్ తో రాజమౌళి మళ్ళీ బాలీవుడ్ లోనూ విజయ ఢంకా ఘనంగా మోగించాడు. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’తో ప్రశాంత్ నీల్ మళ్ళీ తన పంజా రుచి చూపించబోతున్నాడు. మరి కొద్ది గంటల్లో కేజీఎఫ్ బొమ్మ గ్రాండ్ గా పడిపోతోంది.
Also Read: Naga Chaitanya: నాగ చైతన్య కి చుక్కలు చూపించిన హైదరాబాద్ పోలీసులు
ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను లెక్కిస్తే.. ఆర్ఆర్ఆర్ రికార్డులు కూడా తుడుచుకుపెట్టి పోయేలా ఉన్నాయి. అన్నీ కుదిరితే… తొలి రోజు వసూళ్లలో.. కేజీఎఫ్ 2 సరి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సౌత్ సినిమా ఈ స్థాయిలో విజృంభించడానికి కారకుడు, మార్గ దర్శకుడు రాజమౌళి మాత్రమే అంటూ ప్రశాంత్ నీల్ క్రెడిట్ మొత్తం జక్కన్నకు ఇవ్వడం విశేషం.

కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో… ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ”చిన్న గల్లీ లాంటి పాన్ ఇండియా సినిమా స్థాయిని.. రాజమౌళి ఎనిమిది రోడ్ల హైవేగా మార్చాడు. అందుకే, రాజమౌళి డైరెక్టర్ కాదు.. ఒక కాంట్రాక్టర్. దక్షిణాది సినిమా గుర్తింపుకు ఆయనే కారణం. మాకు రాజమౌళినే అతి పెద్ద స్ఫూర్తి” అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.
Also Read:Prashanth Neel: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్
[…] […]
[…] […]