Salaar 2 Glimpse: ‘సలార్'(Salaar Movie) చిత్రాన్ని కేవలం ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు మాత్రమే కాదు, అందరి హీరోల అభిమానులు, యూత్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడ్డారు. థియేటర్స్ లో ఈ చిత్రం అనుకున్న రేంజ్ టార్గెట్ కి చేరుకోలేదు, కానీ ఓటీటీ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ జనరేషన్ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా ని ఒక వ్యసనం లాగా మార్చేసింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ కి ఉన్న డిమాండ్, ప్రస్తుతం ఇండియా లో ఏ సినిమా సీక్వెల్ కి కూడా లేదు. వాస్తవానికి ఈ సినిమాని వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ ఎన్టీఆర్ ఎప్పటి నుండో తన సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసేలోపు ప్రశాంత్ నీల్ ముందుగా ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాడు. కానీ ‘సలార్ 2’ కి సంబంధించి కొంత భాగం షూటింగ్ గత ఏడాది ప్రారంభం లో చేశారట మేకర్స్.
ఇక ఆ తర్వాత ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ పై తన రైటింగ్ టీం తో కూర్చొని గత ఏడాది నుండి రాయిస్తూనే ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ సినిమా తో బిజీ గా ఉన్నప్పటికీ ‘సలార్ 2’ స్క్రిప్ట్ కోసం ప్రతీ రోజు కొంత సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు ఇప్పటికీ కొంతమందిలో ఉన్నాయి. అలా అందరి సందేహాలకు తెరదించుతూ ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ వీడియో లో సెకండ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూపించి , చివర్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక షాట్ ని చూపిస్తూ షూటింగ్ ప్రారంభం తేదీ ప్రకటిస్తారట. ఇది ‘సలార్’ చిత్రాన్ని అభిమానించే ప్రతీ ఒక్కరికి పండగ లాంటి వార్త అనే చెప్పాలి.
ఇకపోతే మొదటి భాగం లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పూర్తి చేయకుండా వదిలేసాడు ప్రశాంత్ నీల్. హీరో అసలు అడుగుపెట్టింది ఖాన్సార్ సింహాసనం మీద కూర్చోవడానికే అన్నట్టుగా క్లైమాక్స్ లో చూపిస్తాడు దర్శకుడు. మరి అలాంటప్పుడు తన స్నేహితుడు వరదా ఎలా ఆ సింహాసనం పై కూర్చున్నాడు?, ప్రభాస్ ఎందుకు ఖాన్సార్ ని వదిలి అజ్ఞాతం లో జీవించాల్సి వచ్చింది?, స్నేహితుడి కోసం త్యాగం చేశాడా?, ఒకవేళ త్యాగం చేస్తే, అదే ఖాన్సార్ లో ఉంటూ రక్షకుడిగా ఉండొచ్చు కదా? వంటి ప్రశ్నలు జనాల్లో బుర్రలో వేసాడు డైరెక్టర్. అంతే కాదు ప్రాణ స్నేహితులు గా ఉన్నటువంటి దేవా, వరదా ని భద్ర శత్రువులుగా మారిపోయారు అన్నట్టుగా మొదటి భాగం లో చూపించారు. ఎందుకు అలా మారిపోయారు?, వాళ్ళ మధ్య జరిగింది ఏంటి?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సలార్ సీక్వెల్.
