Salaar 2: సలార్ 2 కి ఎన్టీయార్ సినిమాకి మధ్య ఆ క్యారెక్టర్ తో కనెక్షన్ కలిపేస్తున్న ప్రశాంత్ నీల్…

ఇప్పుడు సలార్ 2 సినిమాని ప్లాన్ చేస్తూనే, మరోపక్క ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే సలార్ సినిమాలో కీలకపాత్ర వహించిన పృథ్వి రాజ్ సుకుమారన్...

Written By: Gopi, Updated On : May 17, 2024 2:06 pm

Prashanth Neel connecting with that character between Salaar 2 and NTR movie

Follow us on

Salaar 2: కేజిఎఫ్ సిరిస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్..ఈయన కన్నడ దర్శకుడు అయినప్పటికీ కే జి ఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత ప్రభాస్ నూ హీరోగా పెట్టి తీసిన సలార్ సినిమా చేసి దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా వెలుగొందాడు.

ఇక ఇప్పుడు సలార్ 2 సినిమాని ప్లాన్ చేస్తూనే, మరోపక్క ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే సలార్ సినిమాలో కీలకపాత్ర వహించిన పృథ్వి రాజ్ సుకుమారన్ ఆయన పోషించిన శక్తిమన్నార్ పాత్ర గురించి మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ ఇంకా ముందుకు సాగిపోతుంది అంటూ ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఇక దాంతో ఈ సినిమాకి, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి మధ్య కనెక్షన్ అయితే ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎన్టీయార్ సినిమాకి సలార్ సినిమాకి మధ్య కనెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక అలాగే సలార్ కి ఎన్టీఆర్ సినిమాకి మధ్య శక్తిమన్నార్ క్యారెక్టర్ తో ఇంటర్ లింక్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే నీల్ యూనివర్స్ లో ప్రభాస్ ని ఎన్టీఆర్ ని ఏకం చేయబోతున్నట్టుగా కూడా వార్తలేతే వస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరు హీరోలతో రౌడీలా మీద యుద్ధం చేయించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాల ద్వారా నీల్ యూనివర్స్ భారీగా ఎలివేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…