Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రెండు భాగాలుగా రానుందని వార్తలు వచ్చాయి. అసలు ఈ మధ్య తమ సినిమాకి బడ్జెట్ పెరిగితే.. దర్శక నిర్మాతలు వెంటనే రెండు పార్ట్స్ అంటూ హడావుడి చేస్తున్నారు. నిజానికి ఈ రెండు భాగాల ట్రెండ్ బాహుబలితో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సర్వసాధారణం అయిపోయింది.
ఒక సినిమాకు రెండు భాగాలు అంటే.. రెండు సినిమాలకు వచ్చే అంత డబ్బు వచ్చినట్టే. నిజానికి బాహుబలి రెండు భాగాలుగా రావడం వల్లే, వందల కోట్లు లాభాలను గడించింది. ఇక కేజీఎఫ్ తొలి భాగం సూపర్ హిట్ అయి కోట్లు కుమ్మరించింది. రానున్న చాప్టర్ 2 పూర్తిగా లాభమే. అందుకే బన్నీ ఎక్కువ ఆలోచించకుండా పుష్షను పార్ట్ 1, పార్ట్ 2గా మార్చేసి.. బడ్జెట్ పై నిర్మాతలకు భరోసా ఇచ్చాడు.
Also Read: RRR Naatu Naatu Video Song: ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ వీడియో సాంగ్ రిలీజ్ !
అందుకే సలార్ కూడా అదే దారిలో వెళ్తుంది అని ప్రచారం జరిగింది. కాగా ఈ వార్తల పై తాజాగా ప్రశాంత్ నీల్ స్పందించాడు. కేజీఎఫ్ 2 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ హిట్టయ్యాక నాకు పార్ట్ 2 చేయాలనే ఆలోచన వచ్చింది. సలార్ చిత్రీకరణ సమయంలోనే.. రెండు భాగాలుగా చేయాలని ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు.
అనుకుంటే మాత్రం.. ఓ పెద్ద ఈవెంట్ నిర్వహించి చెబుతాం“ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ రెండు భాగాలుగా తీస్తున్నట్టా, లేదా ? అనే డౌటు మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఇదే ప్రశ్న మీడియా ప్రశాంత్ నీల్ ను అడిగితే.. సలార్ గురించి ఇప్పుడు ఏమి చెప్పలేను అంటూ మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదు.
ప్రస్తుతం తన ధ్యాసంతా.. కేజీఎఫ్ 2పైనే ఉంది అంటూ సలార్ గురించి వార్తలను అవాయిడ్ చేశాడు. అయితే, ప్రశాంత్ నీల్ మాటల్లో ఒక్కటి మాత్రం స్పష్టం అయ్యింది. ఒకవేళ, సలార్ హిట్టయితే.. సలార్ పార్ట్ 2 ఉంటుంది. ‘సలార్’ హిట్ కాకపోతే పార్ట్ 2 ఉండదు. కేజీఎఫ్ ఫార్ములానే సలార్ విషయంలోనూ అప్లై చేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడు.
ఒకవేళ సలార్ రెండు భాగాలుగా వస్తే.. నిర్మాతలకు లాభాల పంట పండినట్టే. పైగా ప్రభాస్ హీరో, బాహుబలి హీరో అంటూ నేషనల్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అన్నిటికి మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు ఆశ పడుతున్నారు.
ఏది ఏమైనా బిజినెస్ పరంగా కూడా భారీ లాభాలను ఆర్జించడంలో ప్రశాంత్ నీల్, రాజమౌళి లాగే బాగా ఆరితేరిపోయిన. కాకపోతే సలార్ ప్రారంభించే ముందు స్క్రిప్ట్ ను ఒక పార్ట్ కి అనుకునే రాసుకున్నారు. మరి మధ్యలో స్క్రిప్ట్ మారిస్తే.. అసలుకే మోసం వస్తోందేమో చూడాలి.
Also Read:Ghani Movie 3 Days Collections: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?