Prashanth Neel And NTR: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది. ఇక వరుస సక్సెస్ లను సాధిస్తూ భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగిన హీరోలు మాత్రమే ఇక్కడ ఎక్కువ కాలం పాటు స్టార్ హీరోలుగా కొనసాగుతారు…లేదంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది…
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక గొప్ప ఐడెంటిటి క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాలు సైతం భారీ విజయాలను దక్కించుకునే విధంగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను మోస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావాలనే ఉద్దేశ్యంతో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట రాబోయే సినిమాలతో ఎన్టీఆర్ తన తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. ఇక మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన ప్రశాంత్ నీల్ (Prashsanth Neel) చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేస్తారు అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు. అది ఏంటి అంటే ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ అప్డేట్ అయితే రాబోతుందట.
ఇక ఆ అప్డేట్ వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేయడం కంటే వార్ 2 సినిమాలోని ఎన్టీఆర్ రాజాసాన్ని ని చూసి ఎంజాయ్ చేయడం బెస్ట్… రెండు ఒకేరోజు వస్తె అభిమానులు సైతం ఎంజాయ్ చేయలేరు కాబట్టి మన అప్డేట్ మరో రోజు పెట్టుకుందాం అని ప్రొడ్యూసర్స్ అయితే స్పందిస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ సినిమాకి వార్ 2 సినిమాకి చాలా తేడా అయితే ఉంది. ప్రశాంత్ నీల్ తన సినిమాలో హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడో మనందరికీ తెలుసు…అందుకే ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడో ఆ పాత్ర తాలూకు షేడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూశారు… ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తీవ్రమైన నిరాశకు గురి చేశారు…