Akkineni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడున్న నాగచైతన్య, అఖిల్ వరకు వాళ్లకి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట వీళ్ళు చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి ఇలాంటి క్రమంలోనే వీళ్ళు చేస్తున్న సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని అక్కినేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి వీళ్లకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక ఈ సంవత్సరం మాత్రం అక్కినేని ఫ్యామిలీ హీరోలు మంచి విజయాలను అందుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే నాగచైతన్య ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుమంత్ సైతం ‘అనగనగా’ అనే సినిమాతో పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించుకొని ఓటిటిలో మంచి వ్యూయర్షిప్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ఇక ఆగస్టు 14వ తేదీన కూలి సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం అక్కినేని హీరోలు అందరూ ఫామ్ లోకి వచ్చే విధంగా కనిపిస్తున్నారు.
భారీ సక్సెస్ లను సాధిస్తే చూడటానికి తమ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక అఖిల్ సైతం ప్రస్తుతం లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ చివర్లో రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి అఖిల్ సైతం తన కెరియర్లో అతిపెద్ద భారీ సక్సెస్ ని సాధిస్తాడా?
లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… మొత్తానికైతే ఇండస్ట్రీలో ఉన్న నట వారసులందరూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తుంటే కేవలం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే వెనుకబడి పోతున్నారు. మరి వీళ్ళు కూడా ఈ సంవత్సరం భారీ విజయాలను అందుకొని తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…