Prashant Verma Remuneration : ఏకంగా రూ.50 కోట్లు.. ప్రశాంత్ వర్మ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కరెక్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ పాన్ ఇండియాలో కేవలం మూడో సినిమాతోనే సత్తా చాటుకున్న దర్శకుడు మాత్రం ప్రశాంత్ వర్మ ఒక్కడే...ఆయన లాంటి తక్కువ రేట్ లో బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకొచ్చే దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : October 20, 2024 5:24 pm

Prashant Verma Remuneration

Follow us on

Prashant Verma Remuneration : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ డైరెక్షర్ గా ముందుకు దూసుకెళ్తున్న వారిలో ప్రశాంత్ వర్మ మొదటి స్థానంలో ఉంటాడు. ఈయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యాన్నైతే సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో కూడా సత్తా చాటుకున్న యంగ్ డైరెక్టర్ గా కూడా ఈయన చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 350 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న జై హనుమాన్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి 50 కోట్ల రెమ్యూనరేషన్ ను అడుగుతున్నట్టుగా వర్థలైతే వస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి అంత భారీ మొత్తాన్ని చెల్లించలేనని చెప్పడంతో ‘జై హనుమాన్’ సినిమా రైట్స్ ని మైత్రి వాళ్ళు తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ 50 కోట్లు డిమాండ్ చేయడం కరెక్టేనా అంటూ మరికొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక దాంతోపాటుగా లాభాల్లో వాటా కూడా అడుగుతున్నారట. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమాలో భారీ కాస్టింగ్ అయితే ఉంది. మొదటి పార్ట్ 40 కోట్లలో తెరకెక్కింది.

కానీ సెకండ్ పార్ట్ కోసం దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే ఉంది. అందులోను ప్రశాంత్ వర్మకి 50 కోట్లు ఇచ్చినట్లైతే ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది.

మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా బడ్జెట్ భారీ లెవెల్ లో పెరిగిపోతుంది కాబట్టి మైత్రి వాళ్లు ఈ మొత్తాన్ని భరిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మరి కొంతమంది మాత్రం ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుతూ ఆయనకు సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఆయన అంత మొత్తాన్ని తీసుకోవడంలో తప్పేముంది అంటూ అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

మరి ప్రశాంత్ వర్మ తను అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కించి ‘జై హనుమాన్’ సినిమాను కూడా భారీ సక్సెస్ గా నిలుపుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మైత్రి వాళ్లు కూడా ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు పెడతారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…