Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ పుష్కలంగా ఉంది. టీజర్లో కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్ చూపించాడు ప్రశాంత్ నీల్. అలాగే హీరో సలార్ క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు. నటుడు టిల్లు ఆనంద్ ఎలివేషన్స్ ఇస్తుంటే ప్రభాస్ మరో ప్రక్క ఊచ కోత కోస్తున్నాడు. రెండు నిమిషాల సలార్ టీజర్లో ప్రశాంత్ నీల్ కథపై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సలార్ మూవీ ఎలా ఉంటుందో చెప్పలేదు.
అయితే తన మార్కు భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని మాత్రం తెలియజేశాడు. కెజిఎఫ్ సిరీస్ గమనిస్తే రాఖీ భాయ్ ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అదే తరహాలో సలార్ క్యారెక్టర్ ని పరిచయం చేశాడు. పులి, సింహం, ఏనుగు అడవిలో డేంజరస్ కానీ జురాసిక్ పార్క్ లో కాదని చెప్పడం బాగుంది. సలార్ క్యారెక్టర్ ని జురాసిక్ పార్క్ లో డైనోసర్ తో పోల్చాడు. అంటే తిరుగులేని డేంజరస్ వేటగాడిని చెప్పాడు.
కాగా సలార్ విషయంలో ఓ సందిగ్ధత కొనసాగుతుంది. సలార్ కెజిఎఫ్ కథలో భాగమే. రాఖీ భాయ్ మరణించిన నేపథ్యంలో సలార్ ఉద్భవిస్తాడని ప్రచారం జరుగుతుంది. సలార్ టీజర్ ఉదయం 5: 12 నిమిషాలకు విడుదల చేయడం వెనుక కారణం ఇదే. కెజిఎఫ్ 2 లో రాఖీ భాయ్ గోల్డ్ షిప్ మీద అటాక్ అదే సమయానికి జరుగుతుంది, అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ఆ అనుమానాలకు టీజర్లో క్లూ దొరుకుతుందని అందరూ ఆశించారు. కానీ అలాంటి లింక్ ఏమీ చూపించలేదు.
కాబట్టి సలార్-కెజిఎఫ్ చిత్రాలకు సంబంధం ఉందా లేదా? అనే సందేహం కొనసాగుతుంది. అయితే సలార్ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్, టిల్లు ఆనంద్ కీలక రోల్స్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.