Salaar vs Dunky : సలార్, డంకి ల మధ్య పోటిపై స్పందించిన ప్రశాంత్ నీల్…ఏంటంటే..?

ఇక ఒకే టైం లో ఎన్ని సినిమాలు రిలీజ్ చేసిన అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాను తప్ప ఫ్లాప్ అవ్వాలి అని అనుకోను, మన సినిమాలానే అన్ని సినిమాలు ఆడాలి అని అనుకుంటాను...

Written By: NARESH, Updated On : January 1, 2024 3:45 pm
Follow us on

Salaar vs Dunky : సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా విజయం సాధిస్తునే వచ్చింది.ఇక ఇంతకుముందు చేసిన కేజిఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. నిజానికి కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు పైన కలక్షన్లను రాబట్టి బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాలలో ఈ సినిమా మూడోవ స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక ఇది ఉంటే సలార్ సినిమా సక్సెస్ పైన రీసెంట్ గా ప్రశాంత్ నీల్ స్పందిస్తూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక జనాలు ఈ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోల్చి చూస్తున్నారు. ఎందుకంటే సలార్ సినిమా కంటెంట్ సపరేట్, డంకీ సినిమా కంటెంట్ సపరేట్ కాబట్టి వాటిని పోల్చి చూడటం కరెక్ట్ కాదు.ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల వాళ్ల మధ్య పోటీ ఉన్నట్టు గా మనం భావించకూడదు. ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే థియేటర్ లోకి వచ్చాయి.అలా కాకుండా ఆ సినిమాలను మనం పోటీ అనుకోకూడదు జస్ట్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వచ్చాయి అని భావించాలి. ఇద్దరు హీరోల మధ్య ఎప్పుడూ పోటీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే ఒక మంచి సినిమా అనేది బయటికి వస్తుంది. కాబట్టి మనకు మనం ఎప్పుడు వాళ్ళకి మధ్య పోటీ ఉంది అని అనుకుంటాం…

అందుకే అభిమానులు ఆ పోటీ లో ఏ హీరో గెలుస్తాడు అనే దాని మీద ఎప్పుడు గొడవ పడతారు అంటూ తన అభిప్రాయాన్ని తెలియ జేశాడు. బాలీవుడ్ లో సలార్ సినిమాకి ఎక్కువగా థియేటర్లను కేటాయించలేదు నిజానికి థియేటర్లు ఎక్కువగా రాకపోవడానికి డంకీ సినిమా రిలీజ్ అవ్వడమే కారణం. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్లే సలార్ సినిమాకి ఎక్కువగా థియేటర్స్ దొరకలేదు అని నేను అనుకుంటున్నాను అది కూడా మనకు బ్యాడ్ లక్ ఏం కాదు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా సినిమాలకి తక్కువ థియేటర్లు అనేవి కేటాయించబడతాయి.

దానివల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు ఇక దీనివల్ల మనం వాళ్ళని, వాళ్లు మనల్ని దూషించాల్సిన పని అయితే లేదు. నేనెప్పుడూ సినిమా బాగుండాలి అనే కోరుకుంటాను పోటీ అనేది అసలు ఇష్టపడను…ఇద్దరి మధ్య పోటీ ఉండడానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు అందర్నీ అలరించడానికి మాత్రమే సినిమాలు రిలీజ్ అవుతాయి. ప్రేక్షకులు ఒక సినిమా చూసిన తర్వాత మరొక సినిమాను చూస్తారు కాబట్టి దీంట్లో పోటీ అనేది మనం ఎప్పుడు అనుకోవద్దు అంటూ తన మనసులోని మాటని చెప్పాడు.ఇక ఒకే టైం లో ఎన్ని సినిమాలు రిలీజ్ చేసిన అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాను తప్ప ఫ్లాప్ అవ్వాలి అని అనుకోను, మన సినిమాలానే అన్ని సినిమాలు ఆడాలి అని అనుకుంటాను…