https://oktelugu.com/

Prashant Neel : ఎన్టీయార్ కి కండిషన్స్ పెడుతున్న ప్రశాంత్ నీల్…అవేంటో తెలిస్తే షాక్ అవుతారు..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 02:12 PM IST

    Prashant Neel

    Follow us on

    Prashant Neel : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ కొంతమంది మాత్రమే పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతున్నారు. ఇక రీసెంట్ గా దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ను దక్కించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం…

    కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఆయన చేసిన కేజిఎఫ్ 2 సినిమా 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద హిట్టుగా నిలిచింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ లో ముందుకు సాగాలంటే ఎప్పటికప్పుడు వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టినప్పటికి ఈ సినిమా భారీ విజయన్నైతే సాధించలేకపోయింది. ఇక దానివల్లే ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నాడట…

    అయితే ఇప్పటికే ఆయన లుక్కుకు సంబంధించిన కొన్ని టెస్ట్ లను నిర్వహించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఆ లుక్ లో తనని మేకోవర్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇకమీదట ఎన్టీఆర్ ఎక్కడ కూడా బయట కనిపించడానికి వీల్లేదు అంటూ ప్రశాంత నీల్ కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారట.

    దానివల్ల ఎన్టీఆర్ బయట ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తూ ఉండడం విశేషం… మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందంటూ ఇప్పటికే భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి.

    మరి సినిమా మేధావులు సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక సినిమా పండితులను ఆశ్చర్యపరిచేలా భారీ రికార్డులను కొల్లగొడుతుందని చెప్తుండటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. తద్వారా ఇండస్ట్రీ కి ఎలాంటి సక్సెస్ రాబోతుంది అనేది…