Prasar Bharati OTT: రానున్నది డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ యుగం. ప్రభుత్వాలు సైతం డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాయి. ఓటీటీ ఇండస్ట్రీలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా భారత ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి టెలివిజన్ ఛానల్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంటెంట్ ఏడాది పాటు ఓటీటీలో స్ట్రీమ్ చేసుకునేందుకు ఓ ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేసింది.
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రం దశాబ్దాలుగా మారుతూ వస్తుంది. బుర్రకథ, యక్షగానం, తోలుబొమ్మలాట, జానపదాలు, వీధి నాటకాలతో పాటు పలు సాంప్రదాయ కళలు సినిమా రాకముందున్న వినోద మార్గాలు. సినిమా వచ్చాక ఈ కళలు కనుమరుగైపోయాయి. సినిమా తర్వాత వచ్చిన టెలివిజన్ వినోదాన్ని నేరుగా ప్రతి ఇంట్లోకి తీసుకొచ్చింది. సినిమా , టెలివిజన్ రంగాలను ప్రస్తుతం ఓటీటీ డామినేట్ చేస్తుంది.
ఇండియాలో డిజిటిల్ కంటెంట్ మార్కెట్ వేల కోట్లకు చేరింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, ఆపిల్ టీవీ, హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో పోటీపడుతున్నాయి. డొమెస్టిక్ సంస్థలైన జియో టీవీ, జీ 5 వాటికి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. తాజాగా భారత ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానల్స్ తమ కంటెంట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దీని కోసం టెలివిజన్ ఛానల్స్ అప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సొంత టెలివిజన్ ఛానల్స్ కలిగి ఉన్నాయి. స్టార్ అతిపెద్ద శాటిలైట్ గ్రూప్. స్టార్ ఛానల్స్ టెలివిజన్ కంటెంట్ మొత్తం మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు. అలాగే జీ టీవీ ఛానెల్స్ కంటెంట్ జీ 5లో అందుబాటులో ఉంటుంది. సోనీ లివ్, సన్ నెక్స్ ఈ కోవలోకి వస్తాయి.
అయితే కొన్ని టెలివిజన్ ఛానల్స్ కి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లేవు. ఈ ఛానల్స్ ప్రొడ్యూస్ చేసే కంటెంట్ టెలివిజన్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ వరకే పరిమితం. ఇలాంటి సంస్థలకు ప్రసార భారతి ప్రపోజల్ ఉపయోగకరం. ఆల్రెడీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఉన్న స్టార్, జీ, సోని, సన్ నెట్వర్క్ వంటి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.
టీవీ ఛానల్స్ తమ కంటెంట్ ఓటీటీలో ప్రదర్శించేందుకు కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది. 180 రోజుల్లో ఒక ఛానల్ కంటెంట్ సరైన ఆదరణ దక్కించుకోని నేపథ్యంలో దాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నుండి తొలగిస్తారట. ఇక రెవెన్యూ షేరింగ్ విషయానికి వచ్చే సరికి… టీవీ ఛానల్ కి 65% ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కి 35% అట. ఇది చిన్న టెలివిజన్ ఛానల్స్ కి సదావకాశం అనడంలో సందేహం లేదు. తమ కంటెంట్ కి రీచ్ పెంచుకోవడంతో పాటు ఆదాయం సమకూరుతుంది. అలాగే బ్రాండ్ ఇమేజ్ సైతం విస్తరించుకునే అవకాశం దక్కుతుంది.
Web Title: Prasar bharati invites proposals for apps integration with ot platform
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com