https://oktelugu.com/

Prasanna Vadanam OTT: సుహాస్ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో… ప్రసన్నవదనం అక్కడ చూడొచ్చు!

సుహాస్ ఖాతాలో మరో హిట్ పడింది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 20, 2024 / 10:19 AM IST

    Prasanna Vadanam OTT

    Follow us on

    Prasanna Vadanam OTT: సుహాస్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ ప్రసన్న వదనం ‘ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం థియేటర్ లో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతుండడం విశేషం. మే 3న విడుదలైన ‘ ప్రసన్న వదనం ‘ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పైగా సుహాస్ నేచురల్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. మొట్టమొదటి సారిగా ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ. 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

    దీంతో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడింది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మే 24 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. కాగా ప్రసన్న వదనం ఓటిటీ హక్కులు ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ ఏంటంటే .. రేడియో జాకీ సూర్య(సుహాస్) యాక్సిడెంట్ లో తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. ఆ యాక్సిడెంట్ లో సూర్య తలకు కూడా దెబ్బ తగులుతుంది. దాంతో ప్రోసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది.

    ఈ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్లకి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. హీరో ఈ సమస్యతో బాధపడుతూనే దాన్ని అధిగమిస్తూ జీవితంలో ముందుకు వెళ్తుంటాడు. అదే సమయంలో అతనికి పెద్ద సవాల్ ఎదురవుతుంది. అతను ఒక హత్య కేసులో సాక్షిగా మారతాడు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న హీరో నిందితులను ఎలా పోలీసులకు పట్టిస్తాడు? అనేది మిగతా కథ.

    ఈ చిత్రానికి అర్జున్ వై కె దర్శకత్వం వహించారు. లిటిల్ థాట్స్ సినిమాస్, మణికంఠ జె ఎస్, ప్రసాద్ రెడ్డి టి. ఆర్ నిర్మించారు. ఈ చిత్రానికి అర్హ మీడియా సహ నిర్మాతగా వ్యవహరించారు. పాయల్ రాధాకృష్ణ, రాసి సింగ్ హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, షాలిని కీలక పాత్రలు పోషించారు.