Prakash Raj: టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ లో ఓటమి అనంతరం… ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ లో తన సభ్యత్వానికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అలానే ఆ తర్వాత ప్రకాష్ ప్యానల్ నుంచి గెలుపొందిన సభ్యులంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమావేశం తర్వాత కూడా ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ‘మా’ ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలని… ఇటీవల జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్దకు రావడం తెలిసిన విషయమే.

ఇక తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు గురించి ప్రకాష్ రాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు బేసిగ్గా మంచోడే అని… ఆయనకు మంచి హాస్య చతురత ఉందని ప్రకాష్ అన్నారు. కానీ మోహన్ బాబు జోలికి వెళ్లనంత వరకు బాగానే ఉంటుందని… ఆయనతో కెలుక్కుంటే మాత్రం అంతే సంగతులని చెప్పారు. తన వెనుక మనుషులు ఉంటే మోహన్ బాబు రెచ్చిపోతారని… ఎవరూ లేకుంటే మాత్రం సైలెంటుగా ఉంటారని తెలిపారు. ‘మా’ ఎన్నికల రోజు మోహన్ బాబు పాదాలను తాకడం గురించి చెబుతూ … మర్యాదపూర్వకంగానే ఆ పని చేశానని వివరించారు.
రాబోయే రెండేళ్లు మంచు విష్ణు, అతడి ప్యానెల్‌ను నిద్ర పోనివ్వనని.. ప్రతి నెలా రిపోర్ట్ కార్డ్ అడుగుతానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం సభ్యుడై ఉండి ఆయన బెనర్జీ, తనీష్ లాంటి వాళ్లతో… మోహన్ బాబు దారుణంగా ప్రవర్తించారని ప్రకాష్ వెల్లడించారు. అరగంట సేపు బూతులు తిట్టారని… బెనర్జీని కొట్టబోయారని… ఇదేం సంస్కారం అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మామూలు ఎన్నికల తరహాలో ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు చోటు చేసుకున్నాయన్నారు.