https://oktelugu.com/

MAA Elections 2021: పాత పగలన్నీ మరిచి కలిసిపోయిన ప్రకాష్ రాజ్, విష్ణు-మోహన్ బాబు.. ఏం చేశారంటే?

MAA Elections 2021:‘మా’ ఎన్నికలు ఎంత కాకరేపాయో అందరికీ తెలిసిందే. విమర్శలు, ప్రతి విమర్శలు, దుమ్మెత్తిపోసుకోవడాలు.. ఆఖరుకు ఇండస్ట్రీ లొసుగులు అన్నీ బయటపెట్టుకున్నారు. తిట్టుకోవడం ఒక్కటే తక్కువ. మిగతా అన్నింటిని కానిచ్చేశారు. ‘మా’ ఎన్నికల చుట్టూ ఎంత వివాదాలు.. ఎంత రచ్చ జరిగిందో చూశాం. కానీ తీరా ‘మా’ ఎన్నికల పోలింగ్ వేళ కొదమ సింహాల్లా పోటీపడ్డ ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ అయితే మంచు మోహన్ బాబు […]

Written By: NARESH, Updated On : October 10, 2021 10:02 am
Follow us on

MAA Elections 2021:‘మా’ ఎన్నికలు ఎంత కాకరేపాయో అందరికీ తెలిసిందే. విమర్శలు, ప్రతి విమర్శలు, దుమ్మెత్తిపోసుకోవడాలు.. ఆఖరుకు ఇండస్ట్రీ లొసుగులు అన్నీ బయటపెట్టుకున్నారు. తిట్టుకోవడం ఒక్కటే తక్కువ. మిగతా అన్నింటిని కానిచ్చేశారు. ‘మా’ ఎన్నికల చుట్టూ ఎంత వివాదాలు.. ఎంత రచ్చ జరిగిందో చూశాం. కానీ తీరా ‘మా’ ఎన్నికల పోలింగ్ వేళ కొదమ సింహాల్లా పోటీపడ్డ ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ అయితే మంచు మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. మోహన్ బాబు సైతం ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. నిన్నవరకు నువ్వా నేనా అన్నట్టుగా మొదలైన ఈ ప్రచార పర్వం ముగిసింది. ఈ ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన ప్రకాష్ రాజ్-మంచు విష్ణఉలు ఒకరిని ఒకరు హగ్ చేసుకోవడం ఈరోజు పిక్ ఆఫ్ ది డే గా మారింది. మోహన్ బాబు సమక్షంలో ఇద్దరూ చేతులు కలుపుకున్నారు.

ఇక మోహన్ బాబుకు ప్రకాష్ రాజ్ పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు. తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే ఉండడం విశేషం.నిన్నటిదాకా బండ బూతులు తిట్టుకున్న ఈ రెండు గ్రూపులు ఈరోజు కలిసిపోయి హగ్ చేసుకోవడమే ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.

రెండు ప్యానళ్ల నుంచి పోటీచేస్తున్న సభ్యులు పోలింగ్ ను సాధ్యమైనంత ఎక్కువ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు తుది ఫలితం వస్తుందని అంటున్నారు.

హైదరాబాద్ లోని జూబ్లి హిల్స్ పబ్లిక్ స్కూలుకు ఓటు వేసేందుకు సినీ సెలబ్రెటీలు తరలివస్తున్నారు. మా పోలింగ్ ముందు మోహన్ బాబు నిలబడి అందరినీ పలకిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం అందరం కలిసి మెలిసి ఉంటామని యాక్టర్లు చెబుతున్నారు.ఇక వివాదాలు రేపిన పోసాని కృష్ణమురళి సైతం ఓటు వేసేందుకు రావడం విశేషం. పవన్ వెళ్లిపోయాక ఆయన వచ్చాడు.

‘మా’లో మొత్తం 925 మంది సభ్యులున్నారు. వీరిలో 883మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కేంద్రానికి ఎంత మంది వస్తారో చూడాలి.

వీడియో

మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్న ప్రకాశ్ రాజ్ l Prakash Raj Hugs Manchu Vishnu at MAA Elections 2021