https://oktelugu.com/

Pragya Jaiswal: బికినీ వేసిన బాలయ్య హీరోయిన్… వైరల్ గా ప్రగ్య జైస్వాల్ బోల్డ్ ఫోటో షూట్

దర్శకుడు క్రిష్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కంచె మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె హిట్ టాక్ తెచ్చుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 01:23 PM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ఇంటర్నెట్ లో మంటలు రేపింది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రగ్య జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. ఆకర్షించే అందం, ఆకట్టుకునే నటన ఉండి కూడా కెరీర్లో ఎదగలేకపోయింది. హిట్లు పడకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది. తమిళ చిత్రం విరాట్టు తో ప్రగ్య సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ మిర్చిలాంటి కుర్రోడు.

    దర్శకుడు క్రిష్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కంచె మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్య జైస్వాల్ నటనకు ప్రశంసలు దక్కాయి. కంచె అనంతరం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. గుంటూరోడు, నక్షత్రం డిజాస్టర్స్ అయ్యాయి.

    జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. కెరీర్ డౌన్ అవుతున్న టైం లో బోయపాటి శ్రీను అఖండ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అఖండ నాటికి బాలయ్య పరిస్థితి ఏమంత బాగోలేదు. ఆయనతో నటించేందుకు హీరోయిన్స్ ముందుకు రావడం లేదు. అందుకే ఆమెకు అఖండలో ఛాన్స్ వచ్చింది.

    అఖండ బ్లాక్ బస్టర్ కొట్టింది. సోలో హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసింది. అఖండ విజయం ఆమె ఫేట్ మారుస్తుంది అనుకుంటే, అలా జరగలేదు. అఖండ హిట్ క్రెడిట్ బాలయ్య, బోయపాటి లాగేసుకున్నారు. దాంతో ప్రగ్యకు నిరాశే ఎదురైంది.

    ప్రగ్య సన్ ఆఫ్ ఇండియా మూవీ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. బాలయ్యతో కలిసి కొన్ని యాడ్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రగ్య థాయిలాండ్ వెళ్ళింది. అక్కడి హోటల్ లో బికినీ ధరించి అందాలు విందు చేసింది. ప్రగ్య బికిని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.