spot_img
Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan tweet viral : నయనతారపై సెటైర్ల వర్షం కురిపించిన ప్రదీప్ రంగనాథన్ ..వైరల్...

Pradeep Ranganathan tweet viral : నయనతారపై సెటైర్ల వర్షం కురిపించిన ప్రదీప్ రంగనాథన్ ..వైరల్ అవుతున్న ట్వీట్..

Pradeep Ranganathan tweet viral : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఇప్పుడు తమిళనాడు యూత్ ఐకాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). కొంతమంది సీనియర్ హీరోలు , స్టార్ హీరోలు కూడా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో , ప్రదీప్ రంగనాథన్ మొదటి మూడు సినిమాలతో మూడు సార్లు వంద కోట్ల మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. నాల్గవసారి ‘LIK ‘ చిత్రం తో మరోసారి వంద కోట్ల గ్రాస్ ని అందుకుంటాడని అంతా అనుకున్నారు కానీ, ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ జోరుకి బ్రేకులు వేసింది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టి, 50 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తోంది ఈ చిత్రం.

ఇకపోతే ఈ సినిమాకు నిర్మాతగా ప్రముఖ హీరోయిన్ నయనతార వ్యవహరించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆమె భర్త విగ్నేష్ శివన్ వ్యవహరించాడు. అయితే ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లోకి రాకముందు , అందరి లాగానే ఒక సాధారణ మూవీ లవర్. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అలా అప్పట్లో నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘నానుమ్ రౌడీ తాన్’ అనే చిత్రం గురించి ట్విట్టర్ లో కామెంట్ చేశాడు . తమిళ హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరో గా నటించగా, నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పై ప్రదీప్ రంగనాథన్ కామెంట్ చేస్తూ ‘నయనతార మేడం.. మీరు కాస్త తక్కువ నటించండి’ అని అంటాడు. అంటే చాలా ఓవర్ యాక్షన్ చేశారు , అంత అవసరం లేదు , మామూలుగా నటించండి అని దాని అర్థం.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ పోస్ట్ చేయగా , అది బాగా వైరల్ అయ్యింది. అప్పట్లో ఎవరిని అయితే విమర్శించాడో , ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఆమె నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో హీరో గా నటించడం గమనార్హం. మరి ఈ ట్వీట్ ని నయనతార చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందులో హీరోయిన్స్ గా శ్రీలీల , మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రదీప్ స్వీయ దర్శకత్వం లోనే తెరకెక్కనుంది. కోమలి , లవ్ టుడే వంటి చిత్రాల తర్వాత ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమా ఇది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular