Prabhas Kalki 2 crazy update: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2′(Kalki 2 Movie). మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ ని జోడించి 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన వసూళ్ల సునామీ సాధారణమైనది కాదు. 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అలాంటి ప్రభంజనం సృష్టించిన సినిమాకు సీక్వెల్ కాబట్టి ఈ చిత్రం పై ప్రతీ ఒక్కరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. మొదటి భాగం ఎండింగ్ లో సీక్వెల్ కి వచ్చే లీడ్ కూడా వేరే లెవెల్ లో ఉండడం తో ఆడియన్స్ లో అప్పటి నుండే ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి కలిగింది. అసలు ఈ సీక్వెల్ నిజంగా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఆడియన్స్ లో ఉండేవి.
కానీ ఫిబ్రవరి 2 నుండి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం డేట్స్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ మొదటి భాగం లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే రెండవ భాగం లో నటించడం లేదు. ఆమె పెట్టిన షరతులు మూవీ టీం కి చిర్రెత్తిపోయేలా చేసింది. దీంతో మేకర్స్ అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా ద్వారా దీపికా పదుకొనే ఈ చిత్రం లో భాగం కాదంటూ ప్రకటించారు. దీంతో ఆమెకు బదులుగా ఇప్పుడు ఎవరు నటించబోతున్నారు అనే అంశం పై సోషల్ మీడియా లో చాలా కాలం నుండి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే మేకర్స్ హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా వచ్చే నెల నుండి డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని సంప్రదించారట మేకర్స్.
కృతి సనన్, అలియా భట్, కత్రినా కైఫ్ , ప్రియాంక చోప్రా ఇలా ఎంతో మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారట. కానీ చివరికి సాయి పల్లవి, కీర్తి సురేష్ లలో ఒకరిని ఎంచుకోవాలని చూసారు. ముందుగా సాయి పల్లవి ని అడిగారట. ఆమెకు పాత్ర బాగా నచ్చడం తో వెంటనే ఒప్పేసుకుంది అట. దీంతో మేకర్స్ కి కీర్తి సురేష్ వైపు వెళ్లే అవకాశం రాలేదు. నటన లో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా తోపులే. కానీ సాయి పల్లవి కి ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ రావడం ఆమె అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సీత పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ తో పాటు ‘కల్కి 2’ షూటింగ్ ని కూడా సమాంతరంగా రాబోయే రోజుల్లో చేయనుంది సాయి పల్లవి.