Santosh Shoban: సంతోష్ శోభన్.. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డాడు. కానీ ఐదేళ్ల పాటు కాలం కలిసి రాలేదు. సడెన్ గా ఓ రోజు అదృష్టం తలుపు తట్టింది. మొదటి సినిమా చేశాడు. గుర్తింపు రాలేదు. మళ్ళీ గ్యాప్. ఎన్నో అవమానాలు తర్వాత రెండో సినిమా వచ్చింది. ఆ సినిమాకు మంచి హైప్ వచ్చింది. కారణం దర్శకుడు సంపత్ నంది ఆ సినిమాకు నిర్మాత. సినిమా పేరు పేపర్ బాయ్ . సినిమా రిలీజ్ అయ్యాక చివరికి పేపర్ కూడా మిగలలేదు.

ఇలా హీరోగా చేసిన రెండు సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. హీరోగా పెద్దగా ఫలితం దక్కలేదు. కానీ, ఇక్కడే అతని పై రెండు కళ్ళు పడ్డాయి. ఆ కుర్రాడు మన శోభన్ గారి కొడుకా ? అరె పిలిపించండి’ అంటూ ప్రభాస్ చెప్పిన మాట, సంతోష్ శోభన్ జీవితాన్నే మార్చేసింది. దర్శకుడు శోభన్ తనకు మొదటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అంటూ ప్రభాస్ ఆయన పై ఉన్న అభిమానాన్ని ఆయన కొడుకు సంతోష్ శోభన్ పై చూపించాడు.
ఇక ప్రభాస్ అండతో మళ్లీ వరుస సినిమాలు చేతిలోకి వచ్చాయి. ఏ ముహూర్తాన ప్రభాస్ కన్ను, సంతోష్ శోభన్(Santosh Shoban) పై పడిందో గానీ, ఇప్పుడు ఐదు సినిమాలు అతని చేతిలో వున్నాయి. మరో మూడు సినిమాలు ఫైనల్ చేసే పరిస్థితి ఉంది. ఇంకా నలుగురు నిర్మాతలు అతనికి అడ్వాన్స్ లు ఇచ్చారు. కారణం ఒక్కటే.. ప్రభాస్ అండ.
అలాగే సంతోష్ శోభన్ ప్రవర్తన కూడా అతనికి అవకాశాలను తెచ్చి పెట్టింది. సంతోష్ శోభన్ చాలా తగ్గి ఉంటాడు. సగటు హీరోలు చూపించే బిల్డప్ లు, అవలక్షణాలు అతనిలో ఏ మాత్రం లేవు. పైగా నిర్మాతలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. సినిమా నిర్మాణంలో చాలా విషయాల్లో నిర్మాతలకు చాలా ఫేవర్ గా ఉంటాడు.
అందుకే, సంతోష్ శోభన్ కి సరిగ్గా ఏవరేజ్ హిట్ కూడా లేకపోయినా కొంతమంది నిర్మాతలు అతన్ని హీరోగా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే, సంతోష్ శోభన్ కి లైఫ్ ఇచ్చింది మాత్రం ప్రభాసే. గతంలో తనకు ఒక హిట్ ఇచ్చాడు అని, శోభన్ కుటుంబాన్ని ఇలా ఆడుకోవడం ప్రభాస్ సేవ గుణానికి ఇది నిదర్శనం.
Also Read: మెగాస్టార్ కి చెల్లెలిగా నటించనున్న సీనియర్ నటి… ఎవరంటే ?