https://oktelugu.com/

Kantara : ‘కాంతారా’ దర్శకుడితో ప్రభాస్..ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ప్రయోగం..స్టోరీ లైన్ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి!

ప్రస్తుతం ఇండియా లో ది బెస్ట్ లైనప్ ఉన్న సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. 'సలార్', 'కల్కి' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 05:03 PM IST

    Kantara

    Follow us on

    Kantara : ప్రస్తుతం ఇండియా లో ది బెస్ట్ లైనప్ ఉన్న సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ భవిష్యత్తులో చేయబోతున్న సినిమాల రేంజ్ ని కూడా చూసి, ఇప్పట్లో ఈయనకి దరిదాపుల్లో మరో హీరో రారు అనుకుంటున్నారు ఫ్యాన్స్. లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది. ఈ సినిమాలన్నీ వెయ్యి కోట్ల రూపాయిల రేంజ్ సత్తా ఉన్న సినిమాలే. విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అల్లకల్లోలంగా ఉంటాయి. అయితే ప్రభాస్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఆయన హోమబుల్ సంస్థ లో మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

    వాటిల్లో ఒక ప్రాజెక్ట్ లోకేష్ కనకరాజ్ తో ఉండగా, మరో ప్రాజెక్ట్ ‘సలార్ 2’. ఈ రెండు చిత్రాలు కాకుండా మూడవ చిత్రం కాంతారా దర్శకుడితో ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. కాంతారా చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, అందులో హీరో గా కూడా నటించాడు రిషబ్ శెట్టి. ఆయన అద్భుతమైన నటనకు గుర్తింపుగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాంటి డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. కానీ ఈ చిత్రానికి ఆయన దర్శకుడిగా వ్యవహరించడం లేదు. కేవలం ఒక రచయితగా మాత్రమే వ్యవహరిస్తాడట. రీసెంట్ గానే ఆయన హోమబుల్ సంస్థ అధినేతలకు ఒక స్టోరీ ని వినిపించాడట. ఈ స్టోరీ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎవ్వరూ ముట్టుకొని జానర్ తో తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట.

    ఈమధ్య కాలంలో ప్రభాస్ నటన అనుకున్న స్థాయిలో హైలైట్ అవ్వలేదు. కల్కి చిత్రం లో కూడా ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్ కి ప్రశంసలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యం లో ప్రభాస్ లోని నటుడుని బయటకి తీసే కథతో రిషబ్ శెట్టి వచ్చాడట. త్వరలోనే ఈ కథని స్వయంగా ఆయనే ప్రభాస్ కి వినిపిస్తాడట. ప్రభాస్ ఒప్పుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మరో అద్భుతాన్ని చూడొచ్చు. ప్రస్తుతం రిషబ్ శెట్టి దర్శకత్వం కంటే ఎక్కువగా హీరో గా కొనసాగేందుకే ప్రాధాన్యత చూపిస్తున్నాడు. ప్రస్తుతం ‘కాంతారా’ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న ఆయన, జై హనుమాన్ లో హనుమాన్ క్యారక్టర్ చేస్తున్నాడు. అదే విధంగా ఛత్రపతి శివాజీ బయోపిక్ లో నటించేందుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.