Mahesh Babu On Prabhas: సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో దగ్గరికి ఒక దర్శకుడుగాని,ఒక నిర్మాతగాని తీసుకొచ్చిన కథను విని అది నచ్చితే తను ఆ సినిమా చేస్తాడు, నచ్చకపోతే నచ్చలేదని సినిమా నుంచి తప్పించుకుంటాడు ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక హీరో విన్న కథ తనకు సెట్ అవ్వదు మరో హీరో కైతే బాగా సెట్ అవుతుంది అంటూ ఆ హీరో కి ఆ కథ చెప్పించి ఆయన చేత ఆ సినిమా చేయించిన హీరోలు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.
మహేష్ బాబు వరుసగా చాలా సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు…అయితే ఇలాంటి మహేష్ బాబు దగ్గరికి మిస్టర్ పర్ఫెక్ట్ స్టోరీ త్తిసుకొని దిల్ రాజు, దశరథ్ ఇద్దరూ కలిసి వెళ్ళి కథ చెప్పగా కథ బావుంది కానీ నాకు సెట్ అవ్వదు అని మహేష్ బాబు చెప్పి ప్రభాస్ కి అయితే ఈ కథ బాగుంటుంది అని తనే రిఫర్ చేసి ప్రభాస్ తో ఈ సినిమా చేయించినట్టుగా తెలుస్తుంది.
దాంతో ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో ఒక మంచి డీసెంట్ హిట్ గా మిగిలింది. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు చొరవ తీసుకొని ప్రభాస్ కి చెప్పడమే కాకుండా ఇలా కథ చెప్పడానికి వస్తున్నారు అది ఒకసారి విను అని కూడా ప్రభాస్ తో చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. నిజానికి తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరు కూడా చాలా జెన్యూన్ గా ఉంటారు. ఇగొలు ఏమి లేకుండా చాలా బాగా మాట్లాడుకుంటూ అందరితో కలిసి పోతూ ఉంటారు.
అందుకే వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు గొడవలకి వెళ్లరు. ముఖ్యంగా మహేష్ బాబు అయితే చాలా కామ్ గా ఉంటాడు ఇక అలాగే ప్రభాస్ కూడా ఎక్కువ మొహమాటంతో ఉంటాడు. ఇలా మహేష్ బాబు చేయాల్సిన సూపర్ హిట్ సినిమాని ప్రభాస్ దగ్గరికి పంపించాడు అంటే మహేష్ నిజంగా గ్రేట్ కదా…ఇక ఈ సినిమాని చేసిన ప్రభాస్ ఒక డీసెంట్ హిట్ అందుకోవడమే కాకుండా తన కెరియర్ లో వరుసగా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి రెండు వరుస హిట్లను అందుకున్నాడు…