Prabhas: ప్రతి ప్రేక్షకుడి మెప్పు పొందేలా సినిమాలను చేస్తూ, వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి అహర్నిశలు కష్టపడే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఈయన చేసిన మొదటి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా దాకా ప్రతి సినిమాలో కూడా తన పర్ఫామెన్స్ లో పరిణితి ని కనబరుస్తూ వస్తున్నాడు. ఇక పాన్ ఇండియా లో తెలుగు సినిమాల సత్తా చాటిన మొదటి సౌత్ హీరోగా కూడా ఒక అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశాడు.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ పేరు మరోసారి మారు మ్రోగిపోయేలా చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు చేసే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు మూడు సినిమాలతో భారీ ఫ్లాప్ లను అందుకున్న ప్రభాస్ ఇకమీదట చేయబోయే సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకూడదు అనే ఉద్దేశ్యం తోనే ముందుకు కదులుతున్నట్టు గా కూడా తెలుస్తుంది.
ఇక ఇదే క్రమంలో ప్రభాస్ మారుతితో చేస్తున్న ‘రాజసాబ్’ సినిమా మీద కొంతవరకు అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రభాస్ ఒకప్పుడు చేసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ టైమ్ లో తను ఎలా జోవియల్ గా ఉన్నాడో అలాంటి క్యారెక్టరే కావడం అలాగే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఈ సినిమాను చూసిన అభిమానులు తనని ఆ క్యారెక్టర్ లో యాక్సెప్ట్ చేయగలరా లేదా అనే విషయంలో ప్రభాస్ కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలి, సలార్ లాంటి సినిమాల్లో పోషించిన పాత్రలకి దీనికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ప్రభాస్ అలా బయపడుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక అలాగే ప్రభాస్ సైన్స్ ఫిక్షన్, మైథాలజికల్ లాంటి సినిమాలను కూడా చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పక్క కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయం లో ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ని కట్టబెడతారు అనే ఒక భయం ఉండటం సహజమే. ఇక మొత్తానికైతే మారుతి ఈ సినిమాని చాలా బాగా తీస్తున్నాడట.
అందువల్ల ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి ఈ సినిమా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన పెద్దగా పోయేదేం లేదు కానీ, ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం మారుతికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ అయితే ఏర్పడుతుంది. అలాగే స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ప్రభాస్ కంటే కూడా మారుతికి చాలా కీలకమనే చెప్పాలి…