Prabhas Warning To Director: ప్రభాస్ మిస్టర్ కూల్. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇండియాస్ టాప్ స్టార్స్ లో ఒకరైన ప్రభాస్ ఒదిగి ఉంటారు. ఈ విషయాన్ని ఆయనతో పని చేసిన పలువురు కో స్టార్స్ వెల్లడించారు. ఇక విరాళాలు ఇవ్వడంలో, దానాలు చేయడంలో కూడా వెనుకాడడు. సెట్ లో ప్రతి ఒక్కరు మంచి భోజనం చేసేలా చూసుకుంటాడట. తన హీరోయిన్స్ కి అరుదైన నాన్ వెజ్ వంటకాలతో ఆతిథ్యం ఇవ్వడం ప్రభాస్ కి అలవాటుగా ఉంది. ప్రభాస్ వంటి స్వీట్ పర్సన్ మరొకరు ఉండరు అనడంలో సందేహం లేదు.
అలాంటి ప్రభాస్ సెట్ లో ఒకింత అసహనానికి గురయ్యాడట. దర్శకుడి తీరు నచ్చక పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. మేటర్ లోకి వెళితే.. సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వార్ 2 కాలం నాటి కథ అని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. పౌజీ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. కాగా పౌజీ మూవీ సెట్స్ లో హను రాఘవపూడి పదే పదే ఆగ్రహానికి గురవుతున్నాడట. స్టాఫ్ మీద అరుస్తూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నాడట.
ఇది గమనించిన ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడిని పిలిచి, సున్నితంగా మందలించాడట. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. నువ్వు టెన్షన్ పడితే వర్క్ అవుట్ కాదు. కూల్ గా ఉండు, అని చెప్పాడట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. అదన్నమాట మేటర్. పౌజీ చిత్రంలో ప్రభాస్ కి జంటగా ఇమాన్వి నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం రాజాసాబ్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజాసాబ్ హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుంది. రాజాసాబ్ టీజర్ త్వరలో విడుదల కానుంది. రాజాసాబ్ మూవీ విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతుంది. ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.