https://oktelugu.com/

Prabhas : సర్జరీ చేయించుకున్న ప్రభాస్… వైద్యులు ఏమన్నారంటే!

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2023 / 08:55 PM IST

    Prabhas Surgery

    Follow us on

    Prabhas : హీరో ప్రభాస్ యూరప్ లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు. దీని గురించి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. బాహుబలి సిరీస్ కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ విపరీతంగా కష్టపడ్డారు. శరీరం మీద ప్రయోగాలు చేయడంతో పాటు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. కొన్ని కఠిన యాక్షన్ సీక్వెన్స్ లు చేయడంతో ఆయన మోకాలికి గాయమైందట. అప్పటి నుండి మోకాలి గాయం వేధిస్తుందట. తాత్కాలిక చికిత్సలతో నెట్టుకొస్తున్న ప్రభాస్ కి ఈ మధ్య పెయిన్ మరింత ఎక్కువైందట.

    వైద్యులు సర్జరీ అవసరమని సూచించిన నేపథ్యంలో బ్రేక్ తీసుకుని యూరప్ వెళ్లారు. సర్జరీ సక్సెస్ఫుల్ గా పూర్తి అయ్యింది. అయితే నెల రోజుల వరకూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉందట. యూరప్ లోనే ఈ నెలరోజులు గడపనున్నాడట. నవంబర్ లో ఆయన షూటింగ్స్ సెట్స్ లో జాయిన్ అవుతారని సమాచారం అందుతుంది. సలార్ షూటింగ్ తో పాటు డబ్బింగ్ పూర్తి చేశాడు ప్రభాస్. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాని కారణంగా వాయిదా పడింది.

    దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. పోస్ట్ ఫోన్ విషయం వెల్లడించిన సలార్ నిర్మాతలు నయా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇక కల్కి 2898 AD , రాజా డీలక్స్ షూటింగ్ దశలో ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ. దీపికా పదుకొనె హీరోయిన్, కమల్ హాసన్, అమితాబ్ కీలక రోల్స్ చేస్తున్నారు.

    మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ తెరకెక్కుతుంది. ఇది కామెడీ హారర్ మూవీ అని ప్రచారం జరుగుతుంది. మాళవిక మోహనన్, రద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనంతరం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయాల్సి ఉంది. దర్శకుడు హను రాఘవపూడితో ఓ మూవీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతుంది. శ్రీలీల హీరోయిన్ అంటున్నారు. అలాగే సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్ ఉంటాయని అంటున్నారు.