Akhanda 2 Movie First Review: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ సైతం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది… డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ను సెలబ్రిటీస్ కోసం వేశారు. ఇక దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: పెళ్లి ఔట్ డేటేడ్.. జయా బచ్చన్ స్థాయి మాటలేనా ఇవి..
అఖండ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సినిమా కంటిన్యూ చేశారట… కాశ్మీర్ లోని పహల్గమ్ లో టెర్రరిస్టులు ఇండియన్స్ ని ఎలాగైతే కాల్చి చంపారు. దానికి ఇండియన్ ప్రభుత్వం రివెంజ్ ను కూడా తీసుకుంది. ఇక అలాంటి కొన్ని సంఘటనలతో చలించిపోయిన బోయపాటి అలాంటి టెర్రరిస్టూ ల దాడి జరిగినప్పుడు మన హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అనే సబ్జెక్టుతోనే ఈ సినిమా తెరకెక్కిందట. నీకు అగోరగా ఉన్న బాలకృష్ణ ధర్మాన్ని కాపాడడం కోసం ఏం చేశాడు. ఇతర దేశాలతో సైతం ఎలాంటి ఫైట్ ను చేశాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది…ఈ సినిమాలో బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపించారట. మొత్తానికైతే బాలయ్య మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించడం పక్క అంటూ సినిమా చూసిన కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక బోయపాటి డైరెక్షన్ గత సినిమాలను మించిపోయిందని ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ సినిమా మొత్తానికి హై ఇస్తుందని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని రేంజ్ లో ఉందంటూ వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి…
ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు కొంచెం స్లో అయినప్పటికి ఆ తర్వాత బాలయ్య మరోసారి ఊపొందుకొని కొంతమంది టెర్రరిస్టుల మీద దాడి చేసే ఫైట్ అద్భుతంగా ఉందట… క్లైమాక్స్లో ఇద్దరు బాలయ్య లు చేసే ఫైట్ విరోచితంగా ఉందని చాలామంది తెలియజేస్తున్నారు… ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుల ఉదయాన్నే హత్తుకునేలా ఉండటం విశేషం…
మొత్తానికైతే బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడని వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా జనాల నుంచి ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుంది. బాలయ్య – బోయపాటి ల సక్సెస్ ల పరంపరం కొనసాగిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…