Prabhas Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమాలను ప్రజెంట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేసిన రెండు సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక అలాంటి దర్శకుడి నుంచి రాబోతున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి.
ఇక ప్రభాస్ సైతం సందీప్ రెడ్డి వంగ కి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అందుకే అతను ఏం చెబితే అది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లాస్ట్ షెడ్యూల్లో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ మధ్య చిన్న క్లాసెష్ అయితే వచ్చాయట…కొన్ని బోల్డ్ సన్నివేశాలు సినిమాలో ఉండటం వల్ల ప్రభాస్ అయితే ఆ సన్నివేశాలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట.
కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం పక్కాగా సీన్లను చేయాల్సిందేనని చెబుతున్నారట… ఇక ఆ విషయం మీద కొంత వరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ చెప్పినట్టుగా సినిమా ను తెరకెక్కిస్తున్నాడా లేదంటే సందీప్ రెడ్డి వంగ తన ఇష్టప్రకారమే సినిమాని తీస్తున్నాడా? లేదా అనేది ఇంకా క్లారిటి రావాల్సి ఉంది.
మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ సినిమాని చాలా గ్రాండ్ గా తెరెక్కిస్తుంటాడు. ఇక ఈ సినిమా ఉంటుందా ఈ రేంజ్ లో తెరకెక్కుతుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా ను అనుకున్న టైమ్ కి తీసుకురావడానికి సందీప్ వంగ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…