Prabhas Spirit Movie Update: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన నటుడు ప్రభాస్. ఈ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు. ఆయన హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ ని సంపాదిస్తున్నాడు అంటే ఆయనకి ఎంతటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చ్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు… ఇక స్పిరిట్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇంతకుముందు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని డైలాగ్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వాళ్ళు సైతం ఈ సినిమాని చూసి కొంతవరకు భయపడుతున్నారు అంటూ కొన్ని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
బాలీవుడ్ హీరోలందరు మేము ఏ హీరోకి భయపడటం లేదు అంటూ గతంలో కొన్ని కామెంట్లు చేశారు. వాటిని ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తూ తెలుగు సినిమాలంటే బాలీవుడ్ హీరోలకు భయం ఉంది అందుకే భయం లేదని చెబుతూ కవర్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘వారణాసి’ ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరోసారి షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమాలతో మన స్టార్ హీరోలు హాలీవుడ్లో సైతం పాగా వేస్తారా? మన సినిమాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవల్లో కూర్చోబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…