Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చిన నటుడు... కథ నచ్చక భారీ రెమ్యూనరేషన్ డిమాండ్.

Anil Ravipudi: అనిల్ రావిపూడికి షాక్ ఇచ్చిన నటుడు… కథ నచ్చక భారీ రెమ్యూనరేషన్ డిమాండ్.

Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీయగలిగే కెపాసిటి కొందరికి మాత్రమే ఉంటుంది. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమాలను మాత్రమే చేశాడు. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం ఏదైనా కూడా తెలుగులో ఆయన తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ను సాధించడంతో త్రిబుల్ హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తన పదో సినిమాని వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో ఒక మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కంటే ముందు వేరే ఒక నటుడిని తీసుకోవాలని అనుకున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే మలయాళం లో వైవిధ్యమైన పాత్రలను పోషించి టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ కావడం విశేషం…

ఆయన తెలుగులో పుష్ప సినిమాలో కూడా నటించాడు. భన్వర్ సింగ్ శేఖవత్ క్యారెక్టర్ లో ఆయన నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక ఆయనకి ఒక రెండు నెలల క్రితం అనిల్ రావిపూడి తన సినిమాకు సంబంధించిన నరేషన్ ఇచ్చాడట. కథ మొత్తం విని తనకు భారీ రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేశారట…తనకు 30 కోట్లు ఇస్తే ఈ సినిమా చేస్తానని చెప్పారట. మెయిన్ హీరో అయిన వెంకటేష్ 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

సెకండ్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ అంత మొత్తం లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం నిజంగా అనిల్ ను షాక్ కి గురిచేసిందట. దానికోసమే అతన్ని పక్కన పెట్టినట్టు గా తెలుస్తుంది. ఆయన అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆయనకు ముందుగా కథ నచ్చలేదు. స్టోరీ నచ్చలేదని చెప్పడానికి ఇబ్బంది పడిన ఆయన తన రెమ్యూనరేషన్ ను భారీగా చెబితే వీళ్ళ సినిమా నుంచి తప్పించుకోవచ్చని ఒక ప్లాన్ చేశారట.

మొత్తానికైతే కథ నచ్చకపోతే నచ్చలేదని చెబితే అయిపోతుంది దానికి అంత భారీ మొత్తంలో పారితోషాకాన్ని డిమాండ్ చేయడం ఎందుకు అంటూ అనిల్ రావిపూడి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు… మొత్తానికైతే ఫాహద్ ఫాజిల్ అనిల్ రావిపూడి షాక్ ఇచ్చాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version