Homeఎంటర్టైన్మెంట్Prabhas New Look: ప్రభాస్ షాకింగ్ లుక్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా.. ...

Prabhas New Look: ప్రభాస్ షాకింగ్ లుక్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా.. అసలు ఈ లుక్ దేని కోసమో తెలుసా ?

Prabhas New Look: నేషనల్ స్టార్ ప్రభాస్ సీతారామం ఈవెంట్‌కు వచ్చినప్పుడు ప్రభాస్ లుక్ బాగా వైరల్ అయింది. ఆ వేడుకలో ప్రభాస్ వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న క్యాప్, అలాగే గాగుల్స్ వరకు అన్నీ చాలా స్టైలిష్ గా కనిపించాయి. అయితే, ఇప్పుడు మరోసారి ప్రభాస్ లుక్ వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లోని అవసా హోటల్‌లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. ప్రభాస్ బ్లాక్ షర్ట్ ధరించాడు. ఈ లుక్ లో ప్రభాస్ వెరీ స్టైలిష్‌గా కూల్‌గా కనిపిస్తున్నాడు.

Prabhas New Look
Prabhas

దాంతో ప్రభాస్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రభాస్ ఈ కొత్త లుక్ లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు, అలాగే ప్రభాస్ మీసాలు కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు ఈ కొత్త లుక్ ను ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ ఈ లుక్ ను ఎందుకు ట్రై చేశాడు ? అని ఫ్యాన్స్ చర్చ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ లుక్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ తెలిసింది.

Also Read: Macherla Niyojakavargam Collections: ‘మాచర్ల నియోజకవర్గం’ 4 డేస్ కలెక్షన్స్.. భారీ డిజాస్టర్ .. నితిన్ కెరీర్ కి భారీ దెబ్బ

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ లుక్ సలార్ సినిమాలోది అని తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సలార్” రాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోపక్క యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా పై అనేక నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. సినిమా పై అంచనాలు తగ్గించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ సినిమా ‘ఉగ్రమ్’ అనే కన్నడ సినిమాకి రీమేక్ అని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు వారందరికీ ఈ లుక్ దీటైన సమాధానాన్ని ఇస్తోంది. ఈ లుక్ తో ‘ఉగ్రమ్’కి సలార్ కి సంబంధం లేదని తేలిపోయింది. ఇప్పటికే ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ప్రశాంత్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణాన్ని తీసుకున్నాడు.

Prabhas New Look
Prabhas

పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో త్వరలో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇప్పటికే అక్కడ భారీగా సెట్స్ కూడా వేశారు. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.

Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 11th డే కలెక్షన్స్.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే షాకింగ్ హిట్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version