Pawan Kalyan Sujith : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ చెయ్యబోతున్నాడు..ఇప్పటికే ఆయన ‘హరి హర వీరమల్లు’ అనే పీరియాడికల్ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే..గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ విరామం లేకుండా ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం లో పాల్గొంటున్నారు.

ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే #RRR నిర్మాత డీవీవీ దానయ్య తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ని తీస్తున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.. సాహూ, రన్ రాజా రన్ వంటి మూవీస్ తీసిన సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు..సుజీత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని..ఒక వీరాభిమాని సినిమా తమ అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో గతం లో మనం ఎన్నో చూసాము..ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ కాబోతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఎప్పుడైతే ఈ అధికారిక ప్రకటన చేసారో అప్పటి నుండి సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది..అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి సినీ సెలెబ్రిటీల వరుకు ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహం చూపించారు..ఇప్పుడు వారి జాబితాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా చేరిపోయాడు..ఆయన మాట్లాడుతూ ‘ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరియు డైరెక్టర్ సుజీత్ గారికి శుభాకాంక్షలు..మీ ఇద్దరి కాంబినేషన్ చరిత్ర సృష్టించబోతోంది..నిర్మాత దానయ్య గారికి మరియు టీం కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ ఒక పోస్టు పెట్టాడు.
అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ప్రభాస్ నుండి ఇలా ఊహించని విషెస్ రావడం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యుండి తన తోటి స్టార్ హీరో సినిమా పట్ల ఇంత పాజిటివ్ గా మాట్లాడడం ప్రభాస్ వల్లే అవుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.