https://oktelugu.com/

Manchu Vishnu Kannappa: ప్రభాస్, నయనతార లతో భక్త కన్నప్ప రేంజ్ లో మూవీ తీస్తున్న మంచు విష్ణు…

ఇప్పటికే అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా స్టోరీని రెబల్ స్టార్ ప్రభాస్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో శివుడి పాత్ర కోసం ఆయన ఇప్పటికే ఓకే చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2023 / 12:55 PM IST

    Manchu Vishnu Kannappa

    Follow us on

    Manchu Vishnu Kannappa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో ముందుకు దూసుకుపోతుంటే మోహన్ బాబు కొడుకు అయిన విష్ణు మాత్రం తెలుగులో ఒక్క హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు.ఇక ఇలాంటి టైంలోనే ఆయన భక్త కన్నప్ప అనే ఒక పెద్ద సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాంతోపాటుగా రీసెంట్ గా ఈ శ్రీకాళహస్తిలో ఈ సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలను కూడా భారీ ఎత్తున చేశారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే భక్తకన్నప్ప సినిమాలో కీలకపాత్ర అయిన శివుడి పాత్రను ఎవరు చేస్తున్నారు అనే దానిమీద ఇండస్ట్రీలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

    ఇప్పటికే అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా స్టోరీని రెబల్ స్టార్ ప్రభాస్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో శివుడి పాత్ర కోసం ఆయన ఇప్పటికే ఓకే చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ క్రమంలోనే శివుడి పక్కన నటించే పార్వతి పాత్రలో ఎవరైతే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్న టైంలోనే ఈ సినిమా లో నయనతార పార్వతిగా చేస్తుంది అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు 100 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.కానీ ఈ భక్త కన్నప్ప ప్రాజెక్టులోకి ప్రభాస్, నయనతార ఇద్దరూ చేరుతున్నారు అనగానే మంచు విష్ణు అయితే ఏదో గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు ఆయన ఈ సినిమాతో ఒక భారీ హిట్టు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.

    ఇక ఇప్పటికే యోగి సినిమాలో నయనతార, ప్రభాస్ లు కలిసి నటించారు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారు ఈ సినిమాకి వీళ్ళు చాలా హెల్ప్ అవుతారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ శివపార్వతులుగా ప్రభాస్ ని నయనతారని ఊహించుకుంటూ ఇప్పటికే సంతోష పడిపోతున్నారు…

    ఇక వీళ్ళతోపాటు బాలీవుడ్ కి చెందిన హీరోలు కూడా ఇందులో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ అయినా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నారు…అయితే ఈ ప్రాజెక్టులో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనేది కొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది…