Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఒక పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, మనసున్న మారాజు కూడా అని ఎన్నోసార్లు రుజువు అయ్యింది. ప్రభాస్ నడవడికలో, ప్రవర్తన లో ఎక్కడా కూడా తాను ఒక పెద్ద సూపర్ స్టార్ అనే గర్వం ఇసుమంత కూడా కనిపించడు. కెరీర్ ప్రారంభం లో ఎలా అయితే ఉన్నాడో, ఇప్పటికీ అదే ప్రవర్తన తో కొనసాగుతున్నాడు. రెండు మూడు హిట్స్ రాగానే, నాకు మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు అని మిడిసిపడుతున్న హీరోలు ఉన్న ఈ రోజుల్లో, ప్రభాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్త్వంతో ఉండడం నేటి తరం యువతకు ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. అంటే కాదు ప్రభాస్ కి ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరు స్నేహితులే. ఆయన రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టేంత సత్తా ఉన్న రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Iconstar Allu Arjun), ఎన్టీఆర్(Junior NTR) వంటి వారు ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్.
ఇది ఇలా ఉండగా ప్రభాస్ కి ఉన్నంత దాన గుణం ఇండస్ట్రీ లో ఎవరికీ ఉండదని అందరూ అంటుంటారు. కుడి చేతితో సాయం చేస్తే, ఎడమ చేతికి తెలియనివ్వకుండా ఉండడం ప్రభాస్ స్పెషాలిటీ. రీసెంట్ గా ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ప్రభాస్ యొక్క గొప్ప గుణం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఫిబ్రవరి 2010 వ సంవత్సరం లో అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాను. ఆరోజు అర్జెంటు గా వైద్యం చేయకపోతే ఈరోజు నేను ఇలా బ్రతికి మీ ముందు ఉండేవాడిని కాదు. నేను హాస్పిటల్ లో చేరిన రోజే ప్రభాస్ తండ్రి చనిపోయాడు. ఒకపక్క తండ్రి చనిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నాడు ప్రభాస్. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అదే రోజున నాకు వైద్యానికి అవసరమయ్యే డబ్బు ని పంపించి నా ప్రాణాలను కాపాడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఇప్పటి వరకు అభిమానులకు తెలియదు. తండ్రి చనిపోయిన దుఃఖం లో కూడా అతను నా సినిమాకి రచయితగా పని చేసాడు అనే ఒక్క కారణంతో నా ప్రాణాలను కాపాడాడు అంటూ తోట ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రభాస్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేసాడు. అవి బయటకి రానివ్వకుండా చూసుకున్నాడంతే. ఇంత మంచి మనసు ఈ కాలంలో ఎవరికి ఉంటుంది చెప్పండి, సొంత రక్తం పంచుకున్న వాళ్ళే పట్టించుకోని రోజులు ఇవి. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ‘కల్కి’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్'(The Raja Saab Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతుంది.