Spirit Movie: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఒకటి ‘స్పిరిట్’. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో కాదు , ప్రేక్షకుల్లో , ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ‘యానిమల్’ , ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రాలతో సందీప్ వంగ క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. యుక్త వయస్సులో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ఎలా ఉండేదో , సందీప్ వంగ టేకింగ్ అంతకు మించి అద్భుతంగా ఉంది. అలాంటి తోపు డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో తగిలితే ఎలా ఉంటుందో , అలాగే ఉండబోతుంది ‘స్పిరిట్’ చిత్రం. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోగా, నేడు హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు లో లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు.
సినిమాలో అత్యంత కీలకంగా నిలిచే జైలు సీక్వెన్స్ లు తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ప్రకాష్ రాజ్, హీరోయిన్ త్రిప్తి దిమిరి మరియు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటుంది. అయితే లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవ్వబోతున్న సందర్భంగా నిన్న సందీప్ వంగ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో అప్లోడ్ చేశాడు . అది ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈ ఫొటోలో ప్రభాస్ కి స్క్రిప్ట్ పేపర్స్ ని ఇచ్చి , సన్నివేశాన్ని సందీప్ వంగ వివరిస్తున్నాడు. ప్రభాస్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈ ఫొటోలో కేవలం వీళ్లిద్దరి నీడలు మాత్రమే ఉన్నాయి. దానికే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందంటే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సందీప్ వంగ మేకింగ్ తాలూకు మార్క్ కేవలం ఆ ఫోటోలోనే కనిపించింది, ఇక సినిమాలో ప్రభాస్ తో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసి ఉండుంటాడో మీరే ఊహించుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మార్చి 7 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇండియన్ భాషలతో పాటు , ఫారిన్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన లో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్స్ గా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. సందీప్ వంగ సినిమాల్లో విలన్స్ ఎంత వైల్డ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో అంతకు మించిన వైల్డ్ గా చూపించబోతున్నారట.
