Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan vs Chiranjeevi: నటనలో కమల్ హాసన్ కి చిరంజీవికి మధ్య ఉన్న తేడా...

Kamal Haasan vs Chiranjeevi: నటనలో కమల్ హాసన్ కి చిరంజీవికి మధ్య ఉన్న తేడా అదేనా..?

Kamal Haasan vs Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నవారు మాత్రమే సక్సెస్ లను సాధిస్తారు. వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలను వస్తాయి అనేది సరైనది కాదు. ఇండస్ట్రీ లో బ్యాక్గ్రౌండ్ ఉండి డబ్బులు ఉన్నంత మాత్రాన ఇక్కడ స్టార్ హీరోలు అయిపోరు. నటుడిగా రాణించానుకున్న ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను చేస్తుండాలి. అలా చేసినప్పుడే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు మన వాళ్ళు సాధించిన విజయాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి… గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… క్లాస్ మాస్ ఏ తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… కొన్ని సందర్భాల్లో ఆయన ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

కానీ నటుడిగా మాత్రం ఆయనకి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఎలాంటి డిఫరెంట్ పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించగలిగే కెపాసిటి చిరంజీవి సొంతం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేసిన కమల్ హాసన్ ఆ తర్వాత అతను చేసిన సినిమాలన్నింటిని తెలుగులో డబ్ చేసి సక్సెస్ లను సాధించి ఇక్కడ కూడా టాప్ హీరోగా మారిపోయాడు.

ఇక ఇప్పటికి ఎవరైనా డిఫరెంట్ గా యాక్టింగ్ చేస్తూ కొత్తదనాన్ని ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తే చాలు వాళ్ళను కమల్ హాసన్ తో పోలుస్తూ ఉంటారు. ఇక అలాంటి కమల్ హాసన్ దిగ్గజ నటుడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి చిరంజీవి కూడా మంచి నటుడు అయినప్పటికి కమల్ హాసన్ – చిరంజీవి మధ్య వ్యత్యాసం ఏంటి అని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

కమల్ హాసన్ ఎలాంటి పాత్ర చేసిన కూడా దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకుడి మనసుకి తాకేలా నటించి మెప్పిస్తాడు. ఇక చిరంజీవి లాంటి నటుడు సైతం ఆ పాత్రను ఓన్ చేసుకొని దాన్ని ఎలివేట్ చేసి నటించే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల చిరంజీవి నటించినప్పుడు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కానీ కమల్ హాసన్ నటించినప్పుడు మాత్రం ఆడియన్ ఆ పాత్రతో ట్రావెల్ చేస్తాడు…ఇక అందులో కమల్ హాసన్ కనిపించడు. ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version