Salaar Teaser Review: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ మూవీ టీజర్ ని కాసేపటి క్రితమే మూవీ టీం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో ప్రభాస్ ని చూపించకుండా, కేవలం ఆయన షాట్స్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను, ఆయన కటౌట్ ని వాడుకుంటూ చూపించారు. ఇక టీజర్ చివర్లో రక్తం నిండిన పిడికిలి ని చూపిస్తూ, ప్రభాస్ ముఖాన్ని బ్లర్ షాట్ లో చూపించారు.
కానీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ షాట్ ని మాత్రం టీజర్ చివర్లో చాలా క్లియర్ గా చూపించారు. ఇక పోతే ఈ టీజర్ ప్రారంభం లో ఒక ముసలాయన పై రౌడీ గ్యాంగ్ మొత్తం గన్ తో అటాక్ చెయ్యడానికి ముందుకు వస్తారు. అప్పుడు ఆయన ఇంగ్లీష్ లో డైలాగ్స్ చెప్తాడు, అది సగం మందికి అర్థం అవ్వొచ్చు కానీ, ఎక్కువ శాతం మందికి మాత్రం చాలా దగ్గరగా వింటే కానీ అర్థం కాదు.
ఇంతకీ ఆ డైలాగ్ చెప్పిన ముసలాయన మరెవరో కాదు, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్. ఈయన గత ఏడాది విడుదలైన ‘కార్తికేయ 2 ‘ లో కూడా కనిపిస్తాడు. ఇందులో ఆయన కృష్ణుడి గురించి చెప్పిన డైలాగ్ ఆరోజుల్లో నేషనల్ వైడ్ గా ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన పృథ్వి రాజ్ సుకుమారన్ అసలు ఇందులో పాజిటివ్ క్యారక్టర్ చేశాడా, లేదా నెగటివ్ క్యారక్టర్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ తన మిత్రుడికి ఇచ్చిన మాట కోసం గ్యాంగ్ స్టర్ గా మారుతాడు, సినిమా మొత్తం స్నేహం కోసమే యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. మరి అలాంటప్పుడు అంత పవర్ ఫుల్ పాత్ర కోసం పృథ్వి రాజ్ ని తీసుకొని ఉండొచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్, చూడాలి మరి.