Prabhas Salaar: టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘సలార్’..KGF సిరీస్ వంటి సంచలనాత్మక విజయం తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తో యాక్షన్ మూవీ చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహకి కూడా అందవు.

ఇప్పటికి ఫస్ట్ లుక్ తప్ప కనీసం టీజర్ కూడా విడుదల కానీ ఈ సినిమా కి మార్కెట్ లో క్రేజ్ మరో పాన్ ఇండియన్ సినిమాకి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శెరవేగంగా సాగుతుంది..ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇక మలయాళం లో స్టార్ హీరోస్ లో ఒకడిగా కొనసాగుతున్న పృద్వి రాజ్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు.
ఇప్పటికి సలార్ మూవీ షూటింగ్ కేవలం 50 శాతం మాత్రమే జరిగింది..ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ ఉండడం తో సలార్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతున్నాయి..కానీ ఎట్టిపరిస్థితి లో ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు..అయితే ఈ సినిమా విడుదల అయ్యే రోజున బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘ఫైటర్’ కూడా విడుదల అవుతుంది అనే టాక్ ఉండేది.

కానీ ఇప్పుడు ఫైటర్ సినిమా సమ్మర్ రేస్ నుండి తప్పుకొని..2024 జనవరి 25వ తేదీన విడుదల అవుతుందని ఈరోజు ఆ మూవీ టీం అధికారిక ప్రకటన చెయ్యడం తో సలార్ కి లైన్ క్లియర్ అయ్యింది..సోలో రిలీజ్ డేట్ లో వస్తుండడం తో బాలీవుడ్ లో ఓపెనింగ్స్ సునామి ని సృష్టించడం ఖాయం అని..కచ్చితంగా KGF చాప్టర్ 2 ఓపెనింగ్ రికార్డు ని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫాన్స్ గట్టిగ నమ్ముతున్నారు.