https://oktelugu.com/

Prabhas Surgery: సర్జరీ కోసం హుటాహుటిన విదేశాలకు ప్రభాస్… ఫ్యాన్స్ ఆందోళన!

కొన్నాళ్లుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. గాయంతోనే ఆయన షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా ప్రభాస్ కఠిన షాట్స్, యాక్షన్ సన్నివేశాల్లో డూప్ ని వాడుతున్నారనే వాదన ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 12, 2023 / 10:35 AM IST

    Prabhas Surgery

    Follow us on

    Prabhas Surgery: వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ యూకే వెళ్లారని సమాచారం. ఆయన ఆదివారం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. సర్జరీ కోసమే ప్రభాస్ ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఒకటికి నాలుగు చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆదిపురుష్ విడుదల కాగా… సలార్ విడుదలకు సిద్ధమైంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ చిత్రాలు చేస్తున్నారు.

    కొన్నాళ్లుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. గాయంతోనే ఆయన షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా ప్రభాస్ కఠిన షాట్స్, యాక్షన్ సన్నివేశాల్లో డూప్ ని వాడుతున్నారనే వాదన ఉంది. మోకాలి నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులు సర్జరీ సూచించారట. యూకేలో ఆయనకు చికిత్స జరగనుందట. సర్జరీ అనంతరం నాలుగు వారాలు రెస్ట్ తీసుకుంటారట. అనంతరం రాజా డీలక్స్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.

    ఈ వార్తలు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మోకాలి సర్జరీనే కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం. ఇక సెప్టెంబర్ 28న విడుదల కావల్సిన సలార్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. సలార్ విడుదల వాయిదా వార్తల నేపథ్యంలో పలు చిత్రాలు ఆ డేట్ పై కన్నేశాయి. 15న విడుదల కావాల్సిన స్కంద చిత్రాన్ని 28కి వాయిదా వేశారు. రూల్స్ రంజన్, పెదకాపు, 28, 29 తారీఖుల్లో విడుదలవుతున్నాయి.

    సలార్ సంక్రాంతికి విడుదల చేయొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో అది సరైన సమయం కాదు. అందుకే నవంబర్, డిసెంబర్ నెలల్లో సలార్ విడుదల ప్లాన్ చేస్తున్నారని వినికిడి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ పనులన్నీ ప్రభాస్ పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ చిత్రంలో ఆయనకు జంటగా శృతి హాసన్ నటిస్తుంది.