Prabhas- Rajamouli: రాజమౌళి-ప్రభాస్ కాంబో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రాజమౌళి అత్యధిక చిత్రాలు చేసిన హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఛత్రపతి కోసం మొదటిసారి చేతులు కలిపిన వీరిద్దరూ బాహుబలి, బాహుబలి 2 వంటి ఇండియన్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. బాహుబలి 2 ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ప్రభాస్-రాజమౌళి సినిమా చేస్తే బాక్సాఫీస్ సునామే అని చెప్పాలి. అయితే వీరి కాంబోలో మూవీ రానుంది. అది కూడా అతి త్వరలో అంటున్నారు. అయితే చిన్న ట్విస్ట్, ఇక్కడ ప్రభాస్ ని రాజమౌళి డైరెక్ట్ చేయడం లేదు.
విషయంలోకి వెళితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 AD లో రాజమౌళి నటిస్తున్నారని లేటెస్ట్ టాక్. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెంజెడ్స్ తో పాటు దీపికా పదుకొనె వంటి టాప్ హీరోయిన్ నటిస్తుంది. తాజాగా రాజమౌళి పేరు తెరపైకి వచ్చింది.
రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, నటుడు కూడా. ఆయన పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇక తన సినిమాల్లో నటించే నటులకు ప్రతి సన్నివేశం చేసి చూపిస్తాడు. రాజమౌళికి నటించడంపై మక్కువ ఉంది. ఈ క్రమంలో ఆయన కల్కి మూవీలో చిన్న పాత్ర చేశాడనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాలి.
కల్కి 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మేకింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరో ఆరు నెలలు వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ లేక జులై నెలలో కల్కి విడుదల కానుందని ప్రచారం అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో మ్యాజిక్ చేస్తాడని చిత్ర వర్గాల్లో విశ్వాసం ఉంది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది.