Radhe Shyam: బాహుబలి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ని మార్చేసింది అని చెప్పాలి. ఆ మూవీ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కాగా నేడు ఆయన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “రాధే శ్యామ్” చిత్రం టీజర్ ని మూవీ యూనిట్ టీజర్ ను విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియో లో ప్రభాస్ సూట్ వేసుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో ప్రభాస్ నటించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ లో ఐ యాం విక్రమాదిత్య అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పిరియాడికల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ టీజర్ లో మాత్రం పూజా హెగ్డే ఎక్కడా కనిపించక పోవడం ఆమె అభిమానుల్కు నిరాశ కలిగించింది. ముఖ్యంగా ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.