Radhe Shyam Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి … రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. సినిమా రిలీజ్ కి తక్కువ సమయమే ఉండడంతో ప్రమోషన్స్ ప్రారంభించింది మూవీ యూనిట్.

ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఈ రాతలే ను పాడిన సింగర్, రచయిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ మేరకు సోకిఊయల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు రిలీజ్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న రసవత్తరంగా మారింది. రాధే శ్యామ్ డేట్ పై కూడా కొందరు అనుమాన పడ్డారు కానీ చిత్ర యూనిట్ మాత్రం అదే రిలీజ్ డేట్ కి స్టిక్ అయ్యి ఉన్నటు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ ని పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Join with us & celebrate this beautiful journey of Melodies #EeRaathale🎶
Instagram Live with @kk_lyricist and @hariniivaturi at 7 PM today.#JourneyOfRadheShyam #RadheShyam #Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @thisisysr @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/GgHyKcnPVT
— UV Creations (@UV_Creations) November 19, 2021
ఈ మూవీ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.