Prabhas Radhe Shyam Box Office Collection: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వాస్తవిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.

మొత్తానికి ఈ లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి తక్కువగా పడిపోయాయి. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ కు.. ఆ తర్వాత మూడో రోజు కలెక్షన్స్ కు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక ఎనిమిదో రోజు వచ్చే సరికి కలెక్షన్స్ దారుణాతి దారుణంగా వచ్చాయి.
Also Read: Hero Nani : దసరా నుంచి ‘స్పార్క్ ఆఫ్ దసరా’.. ఆకట్టుకున్న నాని !
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో 7000 స్క్రీన్ లలో విడుదల అయినప్పటికీ.. గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే..
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ 8 డేస్ కలెక్షన్స్ :
నైజాం 23.96 కోట్లు
సీడెడ్ 07.27 కోట్లు
ఉత్తరాంధ్ర 04.94 కోట్లు
ఈస్ట్ 04.24 కోట్లు
వెస్ట్ 03.26 కోట్లు
గుంటూరు 04.37 కోట్లు
కృష్ణా 02.59 కోట్లు
నెల్లూరు 02.10 కోట్లు
ఏపీ మరియు తెలంగాణలో నిన్న వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 52.73 కోట్లు
తమిళ్ నాడు 0.81 కోట్లు
కేరళ 0.38 కోట్లు
కర్ణాటక 04.25 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 09.35 కోట్లు
ఓవర్సీస్ 11.20 కోట్లు
రెస్ట్ 04.16 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 82.88 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

‘రాధే శ్యామ్’కి దాదాపు 196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. 200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇప్పటివరకూ ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని గట్టిగా 82.88 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 117.99 కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తిగా అసాధ్యం. మొత్తానికి రాధే శ్యామ్ పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా తయారైంది. మొత్తానికి వంద కోట్లకు పైగానే లాస్ అని అర్ధం అవుతుంది.
Also Read: నష్టాల వలయంలో చిక్కుకున్న ‘ఆడవాళ్లు..’
[…] Chiranjeevi- Nani: మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ సినిమాల్లోకి రాగానే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అసలు మెగాస్టార్ ఈ స్థాయిలో భారీ చిత్రాలను చాలా వేగంగా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, కాలం ఆయన్ని మళ్ళీ రంగుల ప్రపంచం వైపుకు నెట్టింది. పైగా వేగం రెట్టింపు చేసి వదిలినట్టు ఉంది. మెగాస్టార్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. […]
[…] Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది, కాబట్టి.. అమ్మడు ఏమి చేసినా వార్త అయిపోతుంది. తాజాగా ప్రియాంక చోప్రా తనకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును అమ్మేసింది. పెళ్లైన తర్వాత ప్రియాంక అమెరికాలోనే ఉంటుంది. దీంతో రోల్స్ రాయిస్ కారును వాడే అవకాశం ఆమెకు రావడం లేదు అట. అందుకే.. దాన్ని అమ్మేసింది. ఓ వ్యాపారవేత్త ఈ కారును కొన్నట్టు తెలుస్తోంది. […]
[…] Samantha- Vijay Devarakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ‘సమంత’ నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ సినిమా కథ గురించి కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ కశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది అని, ఇదొక లవ్ స్టోరీ అని, సినిమాలో విజయ్ దేవరకొండ పక్కా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. […]
[…] The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కు ఇంటా బయటా మంచి ఆదరణ లభిస్తోంది. కానీ, న్యూజిలాండ్ లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడగా.. ఆ దేశ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ మద్దతుగా నిలిచారు. ఎన్నో దేశాల్లో విడుదలైన ఈ సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది న్యూజిలాండ్ ప్రజల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. […]