Prabhas vs Pawan Kalyan Multi-Starrer ఇండస్ట్రీ లో సక్సెస్ లను సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క సినిమాతో సక్సెస్ వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోరు. నిరంతరం పోరాటం చేస్తూ వరుస సక్సెస్ లను సాధించిన వాళ్లను మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి సక్సెస్ లు లేకపోతే వాళ్ళను ఎవరు పట్టించుకోరు. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది టాలెంట్ లేక సక్సెస్ లో రాక ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో ఎంతమంది హీరోలు స్టార్లుగా మారుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా వస్తున్న హీరోలు సైతం అహర్నిశలు కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే సక్సెసులైతే వస్తాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప విజయాలను సాధిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సైతం రీసెంట్ గా ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని తన ఫ్యాన్స్ కి ఒక పెద్ద బహుమతి ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చేస్తున్నాడు…నిజానికి ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులైతే కొల్లగొట్టలేక పోయింది. 600 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిక 1300 కోటా కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరు భావించారు. అయినప్పటికి అది సాధ్యం కాలేదు. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా కొత్త రికార్డులను సెట్ చేసి పెడుతుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరొకరిద్దరూ మాత్రం వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయడం అసాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే ఖాళీ సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియాలో పెద్ద సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేయడం అనేది అసాధ్యం.
ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం దానికి మించిన సూపర్ హిట్ సినిమా మరొకటి ఉండదనేది వాస్తవం…కథ ఎలా ఉన్నా కంటెంట్ ఎలా ఉన్నా స్క్రీన్ మీద దర్శకుడు ఎలా ప్రజెంట్ చేసిన కూడా వీళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించారు అంటే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి…