Prabhas Italy Villa: సినిమాకు వంద కోట్లు తీసుకునే ప్రభాస్ కి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఆయన వద్ద అరుదైన కార్లు ఉన్నాయి. ప్రత్యేక విమానం ఉంది. ఇక ఫార్మ్ హౌసెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పని లేక పోతే ఒంటరిగా ఉండటం ప్రభాస్ కి నచ్చిన వ్యాపకం. ఒకరిద్దరు మిత్రులతో తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతారు. కొన్నాళ్లు అక్కడ ప్రశాంతంగా గడుపుతారు. ఈ క్రమంలో విదేశాల్లో కూడా ప్రభాస్ కి ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఇటలీ దేశంలో గల విల్లా ఒకటి. ప్రపంచంలోనే అందమైన, ప్రశాంతమైన దేశాల్లో ఇటలీ ఒకటి.
ఈ దేశంలో ప్రభాస్ కి ఒక పెద్ద లగ్జరీ విల్లా ఉందట. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆ విల్లాలో అనేక గదులు ఉన్నాయట. ప్రభాస్ తరచుగా అక్కడికి వెళుతూ ఉంటారట. అత్యంత సన్నిహితులను మాత్రమే తనతో తీసుకెళతారట. కొన్నాళ్లు గడిపి ఇండియాకు వచ్చేస్తారట. ఎప్పుడు ఇటలీ దేశం వెళ్లినా ప్రభాస్ విడిది అక్కడేనట. ఇక ప్రభాస్ చాలా అరుదుగా అక్కడికి వెళతారు కాబట్టి, ఖాళీగా ఉంచకుండా కొంత భాగం అద్దెకు ఇచ్చారట.
ఆ విల్లా అద్దె ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందట. ఈ మేరకు సోషల్ మీడియా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీక్ ముగియగా దాదాపు నాలుగు వందల కోట్లు రాబట్టింది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వసూళ్లు సరిపోవు. ఆదిపురుష్ దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు. అంటే ఇంకా నిర్మాణ ఖర్చులు కూడా రాలేదు.
అయితే ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాతలు కొంత ఆర్జించారు. ఆదిపురుష్ చిత్రాన్ని అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఫ్యాన్స్ సలార్ పై ఆశలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి సాలిడ్ హిట్ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. మరో వంద రోజుల్లో సలార్ విడుదల కానుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.