https://oktelugu.com/

భారీ బడ్జెట్ లోనూ ప్రభాసే నెంబర్ వన్ !

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌ గా మారిన ప్ర‌భాస్ సినిమా అంటేనే, ప్రస్తుతం వందల కోట్ల వ్యవహారం అయిపొయింది. నిజానికి సాహోకి ప్లాప్ టాక్ వచ్చినా హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. దానికి కారణం ప్రభాస్ స్టార్ డమే. అందుకే సాహో చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ప్ర‌భాస్‌తో బ‌డా చిత్రాల‌ను నిర్మాంచేందుకు హిందీ ఇండస్ట్రీ నిర్మాతలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న‌ రాధేశ్యామ్ చిత్రం 90 శాతం షూటింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : November 24, 2020 / 05:49 PM IST
    Follow us on


    బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌ గా మారిన ప్ర‌భాస్ సినిమా అంటేనే, ప్రస్తుతం వందల కోట్ల వ్యవహారం అయిపొయింది. నిజానికి సాహోకి ప్లాప్ టాక్ వచ్చినా హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. దానికి కారణం ప్రభాస్ స్టార్ డమే. అందుకే సాహో చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ప్ర‌భాస్‌తో బ‌డా చిత్రాల‌ను నిర్మాంచేందుకు హిందీ ఇండస్ట్రీ నిర్మాతలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న‌ రాధేశ్యామ్ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు కూడా భారీగానే ఖర్చు పెట్టారు.

    Also Read: అమీర్ ఖాన్, మహేష్.. ఇద్దరు స్టార్ లను కలుపబోతున్న రాజమౌళి?

    పైగా ప్రభాస్ ఓన్ ప్రొడక్షన్ హౌసే ఈ సినిమాని నిర్మిస్తోంది. కాబట్టి ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటారు. ఇక ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ పీరియాడిక‌ల్ మూవీ, అలాగే ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా సెట్స్‌ పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల బ‌డ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల‌కి పైగానే ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతొంది. అయితే అయింది.. కానీ ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా ఇలాంటి ఫీట్ ను గతంలో సాధించలేదని.. డార్లింగ్ ఫ్యాన్స్ తెగ పోస్ట్ లు పెడుతూ సంబరపడుతున్నారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ బ్రేకింగ్: లీకైన కథ.. ఇదే?

    కాగా రాధేశ్యామ్ చిత్రం రూ.250 కోట్ల బ‌డ్జెట్ ‌తో తెర‌కెక్కుతుండ‌గా, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఆదిపురుష్ అనే ఎపిక్ డ్రామా ఏకంగా రూ.550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఇండియా సినిమాగా కూడా చ‌రిత్ర సృష్టించేలా ఉంది. జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని టీ సిరీ‌స్ నిర్మిస్తుంది. ఆగ‌స్ట్ 11,2022లో మూవీని విడుద‌ల చేయాలని మేకర్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఇక మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్.. ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్ల అట. మొత్తానికి ప్ర‌భాస్ చేస్తున్న సినిమాలన్నీ వందల కోట్లతో తెరకెక్కుతూ అందరిలో ఆస‌క్తిని పెంచుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్