Prabhas new movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్(Prabhas)… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం..ప్రస్తుతం ఆయన దాదాపు 5 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలన్నింటిని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి… ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి చాలామంది హీరోలు చాలా గొప్పగా మాట్లాడిన వీడియోలు మనం చాలానే చూస్తూ వచ్చాము… కానీ బాలీవుడ్ నటుడైన సంజయ్ దత్ (Sanjay Dath) సైతం ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడాడు. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న సంజయ్ దత్ ప్రభాస్ గురించి చాలా చక్కగా మాట్లాడాడు. ప్రభాస్ చాలా మంచి నటుడు అని అతనితో కలిసి రాజాసాబ్ (Rajaasaab) సినిమాలో నటించానని చెప్పాడు. అలాగే ప్రభాస్ ఫుడ్డు పెట్టి మనుషులను చంపేస్తాడని చాలా ఫన్నీగా సమాధానాలు అయితే చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ని సంజయ్ దత్ పొగడడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…నిజానికి ప్రభాస్ లాంటి నటుడు ఎవరితో అయినా ఇలాగే కలిసిపోతూ ఉంటాడు.
Also Read: జూనియర్ ట్రైలర్ అంత ఒకే కానీ ఆ ఒక్కటే పెద్ద మైనస్ గా మారిందా..?
ఎలాంటి ఈగో లు పెట్టుకోకుండా తన తోటి నటులతో పాటు తనకంటే చిన్న హీరోలతో కూడా ఆయన కలిసి ఎలాంటి ఈగోలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. ముఖ్యంగా అతనికి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం అనేది తెలీదు.
ఎవరిని ఎలాంటి మాటలు అనడు. అందువల్లే ప్రభాస్ కి యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
“#Prabhas makes me eat a lot.
I like #Chiranjeevi from Telugu cinema, I share a beautiful relationship with him.” pic.twitter.com/FxmcJshc0R
— Gulte (@GulteOfficial) July 10, 2025
మారుతి (Maruthi) డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాలో దెయ్యం గా కనిపించబోతున్నాడు. మరి ప్రభాస్ కి సంజయ్ దత్ కి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీన్లు రాబోతున్నాయి అనేది చాలా క్యూరియాసిటిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది…