https://oktelugu.com/

Prabhas new look: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ !

Prabhas new look: ‘ప్రభాస్’ ప్రస్తుతం నిజమైన నేషనల్ స్టార్. మరి అలాంటి స్టార్ నుంచి వస్తోన్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ మూవీలోని ప్రభాస్ ఇంట్రెస్టింగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 20, 2022 / 12:24 PM IST
    Follow us on

    Prabhas new look: ‘ప్రభాస్’ ప్రస్తుతం నిజమైన నేషనల్ స్టార్. మరి అలాంటి స్టార్ నుంచి వస్తోన్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ మూవీలోని ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పిక్ వైరల్‌ గా మారింది.

    Prabhas new look

    ఇందులో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుండగా.. దీన్ని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ప్రభాస్ పిక్ బాగా వైరల్ అవుతుంది. ఇక ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, దాంతో సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ లో కూడా అదనపు హంగులు కోరుకోవడం.. ఇలా ఏ రకంగా చూసుకున్నా, ‘రాధేశ్యామ్’ టీం అంచనాలను అందుకోలేకపోయింది.

    Also Read: ‘బాహుబలి’ ప్రభాస్ మరో రికార్డు.. ఆసియాలో నెంబర్ వన్..!

    అయితే, తాజాగా వైరల్ అవుతున్న ప్రభాస్ పిక్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. అందుకే, . యువీ క్రియేషన్స్ సంస్థ పై ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు పాన్ ఇండియా సినిమాలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ సినిమా పై జనం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పైగా రాధాకృష్ణ కుమార్ అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా ఇది. అందుకే అందరికీ ఈ సినిమా పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మంచి పిక్ రావడం సినిమాకి ప్లస్ అవుతుంది.

    Also Read: రెబల్ స్టార్ కథానాయకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా !

    Tags